ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో సదా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘జయం’ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. ‘వెళ్ళవయ్యా వెళ్ళు..’ అనే డైలాగ్ తో బాగా పాపులర్ అయ్యింది. ‘జయం’ హిట్ తో పలు తెలుగు సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. టాలీవుడ్ లో సదా కొన్ని సినిమాలే చేసినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. విక్రమ్ ‘అపరిచితుడు’ సినిమాలో నటించిన అదిరిపోయే హిట్ దక్కించుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా వెండి తెరకు దూరమై.. టీవీ షోలకు జడ్జిగా వ్యవహరించింది. తాజాగా దీపావళి శుభాకాంక్షలు చెప్తూ.. సోషల్ మీడియాలో ట్రెడిషనల్ ఫోటోలను షేర్ చేసింది. Photos Credit: Sada/Instagram