'రంగస్థలం' సినిమాతో పూజిత పొన్నాడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'రంగస్థలం' మూవీలో కుమార్ బాబు ప్రియురాలిగా నటించి మెప్పించింది. మొదట్లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పూజిత మంచి గుర్తింపు పొందింది. 2016లో విడుదలైన 'తుంటరి' సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. రాజుగాడు, హ్యాపీ వెడ్డింగ్, బ్రాండ్ బాబు, వేర్ ఈజ్ వెంకటలక్ష్మి, సెవెన్, కల్కి, మిస్ ఇండియా సినిమాల్లో నటించింది. తాజాగా 'ఓదెల రైల్వేస్టేషన్' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పూజిత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా దీపావళి శుభాకాంక్షలు చెప్తూ వీడియో పోస్ట్ చేసింది. Photos&Video Credit: Poojitha Ponnada/Instagram