హీరోయిన్ రీతూ వర్మ గుర్తు ఉన్నారు కదా! ఆమె పుట్టినరోజు మార్చి 10న! ఈ ఏడాది బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం రీతూ వర్మ మాల్దీవులు వెళ్లారు. మాల్దీవుల్లోని ఓ రిసార్టులో రీతూ వర్మ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. అన్నట్టు... రీతూ వర్మ హైదరాబాదీ అమ్మాయే. మార్వాడీ కుటుంబంలో జన్మించారు. ఫస్ట్ ఎన్టీఆర్ 'బాద్షా'లో కాజల్ సిస్టర్ రోల్ చేశారు. 'ప్రేమ ఇష్క్ కాదల్'తో హీరోయిన్ అయ్యారు. విజయ్ దేవరకొండకు జోడీగా నటించిన 'పెళ్లి చూపులు' రీతూ వర్మకు ఫస్ట్ సక్సెస్ అందించింది. దుల్కర్ సల్మాన్ జోడీగా నటించిన 'కనులు కనులు దోచాయంటే' సినిమా తెలుగు, తమిళ భాషల్లో పెద్ద హిట్. 'వరుడు కావలెను', 'ఒకే ఒక జీవితం' కూడా రీతూ వర్మకు మంచి పేరు తెచ్చాయి. విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న 'ధ్రువ నక్షత్రం'లో కూడా రీతూ వర్మ హీరోయిన్. రీతూ వర్మ (Image Courtesy : Ritu Varma Instagram)