'బిగ్ బాస్' నాన్-స్టాప్ షో మొదలైంది. హోస్ట్ నాగార్జున 17 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించారు. గత బిగ్ బాస్ సీజన్లలోని బిగ్ బాస్ సభ్యులను వారియర్స్‌గా, కొత్త సభ్యులను ఛాలెంజర్స్‌గా హౌస్‌లోకి పంపించారు. షో మొదలైన రెండో రోజే నామినేషన్ ప్రక్రియ షురూ చేశారు బిగ్ బాస్. నామినేషన్స్ లో నటరాజ్, సరయు, ముమైత్ ఖాన్, హమీద, అరియానా, మిత్ర శర్మ, ఆర్జే చైతూ ఉన్నారు. వీరిలో హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారనేది ఇంట్రెస్టింగ్ టాపిక్. ఛాలెంజర్స్ టీమ్ నుంచి ఒకరు బయటకు వెళ్లే ఛాన్స్ ఉందని టాక్. మిత్ర, చైతులలో మిత్రకి తక్కువ ఓట్లు పోల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆర్జే చైతుకి కూడా ఉన్న ఫాలోయింగ్ వలన ఓట్లు బాగానే పడుతున్నాయట. కానీ మిత్ర శర్మకి మాత్రం ఓట్లు రావడం లేదట. ఈ వారం ఆమె ఎలిమినేట్ అవ్వడం ఖాయమని అంటున్నారు.