ముఖమంతా గాయాలతో ఆదా శర్మ - ఆమెకు ఏమైంది? ‘ది కేరళ స్టోరీ’ చిత్రంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది అదా శర్మ. ఎన్నో వివాదాల నడుమ మే 5న ఈ సినిమా విడుదల అయ్యింది. పశ్చిమ బెంగాల్ ఈ సినిమా ప్రదర్శనను నిషేధించింది. కేరళ సీఎం విజయన్ ఈ సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ, తమిళనాడులో ప్రదర్శన నిలిపివేయాలంటూ ఆందోళనలు జరిగాయి. సుదీప్తోసేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు. అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా కోసం అదా శర్మ ఎంతో కష్టపడింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఐఎస్ఐఎస్ ఉచ్చులో చిక్కుకున్న అమ్మాయిలా అదా ప్రాణం పెట్టి నటించి మెప్పించింది. All Photos Credit: Adah Sharma/Instagram