తేజా సజ్జా కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమా 'హను-మాన్'. ఫస్ట్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో సినిమా ఇది. 'హను-మాన్' చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఆయన సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి చిత్రమిది. ఇటీవల 'హను-మాన్' టీజర్ విడుదల చేశారు. పాన్ ఇండియా స్థాయిలో సూపర్ రెస్పాన్స్ లభించింది. పాన్ ఇండియా స్థాయిలో 'హను-మాన్' విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్ స్టార్ట్ చేసే ముందు టీమ్ శ్రీరాముని ఆశీర్వాదం తీసుకుంది. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా సహా 'హను-మాన్' టీమ్ శ్రీరాముని ఆశీర్వాదం కోసం అయోధ్య ఆలయాన్ని సందర్శించింది. టీజర్ రెస్పాన్స్ అద్భుతంగా ఉండటంతో... ఆనందంలో ఉన్న టీమ్, ప్రమోషనల్ క్యాంపెయిన్ అయోధ్య నుంచి స్టార్ట్ చేశారు. 'హను-మాన్' చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అమృతా అయ్యర్ ఈ సినిమాలో హీరోయిన్. వరలక్ష్మి శరత్‌కుమార్ , వినయ్ రాయ్ & రాజ్ దీపక్ శెట్టి కీలక పాత్రధారులు. త్వరలో 'హను-మాన్' విడుదల తేదీ వెల్లడించనున్నారు.