నేచురల్ స్టార్ నాని కుటుంబ సభ్యులతో ఎక్కువ గడిపేందుకు ఇష్టపడతారు. తన పేరెంట్స్ తో పాటు పిల్లలతో సరదాగా గడుపుతారు. ప్రస్తుతం నాని హీరోగా ‘దసరా’ అనే పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కుతున్నది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తున్నది. ఈ మూవీలో రాజుగారి కోట లాంటి ఇంట్లో ఉండే హీరోయిన్.. స్లమ్ లో ఉండే హీరోని ప్రేమిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు ఆకట్టుకుంటున్నాయి. వచ్చే ఏడాది 2023, మార్చి 30న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్న నాని పేరెంట్స్ కలిసి పొలం పనులు చేస్తూ కనిపించారు. Photos & Videos credit@Nani instagram/twitter