టాలీవుడ్ నటుడు అభిజీత్ ఖరీదైన బైక్ ను కొన్నారు.

ఈ ‘బిఎండబ్ల్యూ ఆర్1250 అడ్వెంచర్’ బైక్ ఎక్స్-షో రూమ్ ధర రూ.22,50,000 గా ఉంది.

అందుకు సంబంధించిన వీడియోను అభిజీత్ షేర్ చేశారు.

అభిజీత్ కు ట్రావెలింగ్, బైక్ రేసింగ్ లు అంటే ఇష్టమట.

అంతేకాదు ఎక్కువగా అడ్వెంచర్ ట్రావెలింగ్ చేయడానికి ఇష్టపడతారు.

ట్రావెలింగ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలనే ఎక్కువగా షేర్ చేస్తుంటారు.

‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ మూవీలో శ్రీను పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు అభిజీత్.

తర్వాత పలు చిత్రాల్లో నటించినా స్టార్ ఇమేజ్ రాలేదు. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.

Image Credit: Abijeet/Instagram