చిరంజీవి ‘ఆచార్య’ చూసిన ప్రేక్షకులు ‘అఖండ’లా ఉందని అంటున్నారు.

ఈ సినిమా కథ ‘అఖండ’ను పోలి ఉందని తెలుపుతున్నారు.

రెండు సినిమాలు ‘మైనింగ్’ మాఫియా నేపథ్యంలోనే సాగుతాయి.

‘అఖండ’ తరహాలోనే ‘ఆచార్య’లోనూ హిందూ ధర్మం నేపథ్యంగా ఉంటుంది.

మైనింగ్ మాఫీయాపై అక్కడ ‘అఘోరా’ పోరాడితే.. ఇక్కడ కామ్రెడ్ ‘ఆచార్య’ ఫైట్ చేస్తారు.

‘అఖండ’లో చిన్న బాలయ్యను జైల్లో వేస్తే, ‘ఆచార్య’లో సిద్ధ పాత్రను చంపేశారు.

కొన్ని ఫైట్లు కూడా ‘అఖండ’ సినిమాను పోలి ఉన్నాయి.

‘అఖండ’ దర్శకుడు బోయపాటి హీరోను వీర లెవెల్‌లో ఎలివేట్ చేశారు.

‘ఆచార్య’లో హీరోలను సరిగ్గా ఎలివేట్ చేయలేదని ప్రేక్షకులు అంటున్నారు.

‘అఖండ’కు తమన్ మ్యూజిక్ ప్లస్, కానీ ‘ఆచార్య’లో మణిశర్మ మెప్పించలేకపోయారు.

‘ఆచార్య’ను ‘అఖండ’ సినిమా కంటే ముందే రిలీజ్ చేసి ఉంటే నచ్చేదేమో అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.