టాలీవుడ్, కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో ఆది పినిశెట్టి. ఈ తెలుగింటి కుర్రాడు గత కొన్నాళ్లుగా కన్నడ భామ నిక్కీ గల్రానీతో ప్రేమలో ఉన్నాడు. మార్చి 24న నిక్కీ గల్రానీ, ఆది పినిశెట్టిల ఎంగేజ్మెంట్ జరిగింది. ఆది పినిశెట్టి.. దర్శకుడు రవిరాజ పినిశెట్టి పెద్ద కుమారుడు. ‘బుజ్జిగాడు’ హీరోయిన్ సంజనా గల్రానీ సోదరే నిక్కీ గల్రానీ. నిక్కీ కన్నడ నటైనా, తమిళంలోనే ఎక్కువ చిత్రాలు చేసింది. ఆది పినిశెట్టితో కలిసి నిక్కీ రెండు చిత్రాలు చేసింది. ‘మరకతమణి’, ‘మలుపు’ చిత్రాల్లో వీరిద్దరు కలిసి నటించారు. ‘మలుపు’ చిత్రంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. నిక్కీ, ఆది కంటే పదేళ్లు చిన్నది. ఎట్టకేలకు ఆది, నిక్కీ గల్రానీలు మే 18న పెళ్లితో తమ ప్రేమను గెలిపించుకున్నారు. Images Credit: Aadhi Pinisetty and Nikki Galrani/Instagram