మేష రాశి ఈ రోజు మీ ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. మీ భాగస్వామి మీద్వారా లాభపడతారు. ప్రేమికులకు మంచిరోజు.ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
వృషభ రాశి భవిష్యత్ పై ఆశను పోగొట్టుకోవద్దు. ప్రణాళికలు వేసుకోవడం మంచిది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేయగలుగుతారు.మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది కానీ..అనుకోని ఖర్చులు ఇబ్బందిపెడతాయి.
మిథున రాశి ఈ రోజు మీకు నిన్నటికన్నా మెరుగ్గా ఉంటుంది. కొంచెం కష్టపడితే భారీ లాభాలు వస్తాయి. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీ ఇద్దరి మధ్యా బంధం బావుంటుంది.
కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఇల్లు, ఆస్తికి సంబంధించిన పనులలో జాగ్రత్తగా ఉండాలి. మీ గౌరవం పెరుగుతుంది. కొత్త పని లేదా బాధ్యతలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ మనసులో ఉన్న మాటను ప్రత్యేక వ్యక్తితో పంచుకుంటారు.
సింహ రాశి ఈ రాశివారికి ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు మంచిరోజు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు.
కన్యా రాశి మీ రోజు అనుకూలంగా ఉంటుంది. మిమ్మల్ని మీరు ఎనర్జిటిక్ గా భావిస్తారు. మీ కుటుంబంలో శాంతి, ఆనందం ఉంటుంది. వ్యాపారంలో మీకు ప్రయోజనం కలిగించే వ్యక్తిని మీరు కలుస్తారు.
తులా రాశి ఈరోజు మీ ఆర్థిక పురోగతికి సంకేతాలు ఉన్నాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. ప్రయాణం ఆసక్తికరంగా సాగుతుంది. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు.
వృశ్చిక రాశి కష్టాల్లో ఉన్నవారికి ఈ రాశివారు సహాయం చేస్తారు. ఉద్యోగులు సానుకూల ఫలితాలు పొందుతారు. వ్యాపారం బాగా సాగుతుంది. మీ మొండితనం వీడకపోతే చాలా కోల్పోతారు.
ధనుస్సు రాశి ఈ రాశివారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. నిర్మాణ పనులు చేసే వ్యక్తులు ఈరోజు కొత్త ప్రాజెక్ట్ పొందుతారు. ఆర్థిక ప్రయోజనాలు బాగానే ఉంటాయి. ఈ రాశి విద్యార్థులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది.
మకర రాశి ఈ రోజు మీ భాగస్వామి మనసులో మాటను అర్థంచేసుకుంటారు. వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. కుటుంబ సమేతంగా మతపరమైన ప్రయాణాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు.
కుంభ రాశి భావోద్వేగాల ఆటుపోట్లు పెరుగుతాయి. మీ ప్రవర్తన మీ చుట్టూ ఉన్న వ్యక్తులను గందరగోళానికి గురి చేస్తుంది. తక్షణ ఫలితాలు కావాలంటే మాత్రం నిరాశ తప్పదు.అనుకోని ఖర్చులు పెరిగి మీ మనశ్శాంతికి భంగం కలిగిస్తాయి.
మీన రాశి మీరు పురోగతికి కొత్త మార్గాలను పొందుతారు. కొంతమంది మంచి వ్యక్తులతో మీ సమావేశం రోజును మెరుగుపరుస్తుంది. మీ మూడ్ చాలా బాగుంటుంది. వ్యాపారంలో పురోగతి సాధారణంగా ఉంటుంది. వివాహ బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది.