లేడీ సూపర్ స్టార్ నయనతారకు 2023 బాగా కలిసొచ్చింది.

ఈ సంవత్సరం ‘జవాన్’తో బాలీవుడ్‌లోకి నయనతార ఎంట్రీ ఇచ్చారు.

2023లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమా ‘జవాన్’నే.

రూ.1150 కోట్లకు పైగా వసూళ్లను ‘జవాన్’ సాధించింది.

దీంతో నయనతారకు బాలీవుడ్‌లో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంది.

‘జవాన్’ సెప్టెంబర్‌లో విడుదల అయింది.

అదే నెలలో నయనతార నటించిన థ్రిల్లర్ ‘ఇరైవన్’ కూడా విడుదల అయింది.

కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు.

ఇందులో నయనతార... జయం రవి సరసన నటించారు.

డిసెంబర్‌లో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ‘అన్నపూరాని’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.