ఈ రోజు ఈ రాశివారికి లక్, ఆ రాశివారికి సక్సెస్
జనవరి 12 రాశిఫలాలు



మేష రాశి
సంతోషకరమైన జీవితం కావాలంటే మీ మొండివైఖరిని పక్కన పెట్టండి. మీ తీరు వల్ల సమయం వృధా తప్ప ఏమీ ప్రయోజనం లేదు. ఇతరులను ఆకట్టుకోవడానికి ఎక్కువ ట్రై చేయకండి. ఉద్యోగులు, వ్యాపారులు తమ పనులపై శ్రద్ధ వహించండి.



వృషభ రాశి
ఈ రోజు మీకు ఇష్టమైన రోజు. వైవాహిక సంబంధం బావుంటుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్లొచ్చు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఉద్యోగులు సమయం వృధా చేయకుండా పని చేయండి.



మిధున రాశి
కొత్తగా ఏదైనా చేయాలి అనుకుంటే ఈ రోజు ప్రారంభించడం మంచిది. తలపెట్టిన పనుల్లో సక్సెస్ అవుతారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. యువత వేరే వ్యవహారాలతో సమయం వృధా చేసుకోవద్దు. వేరేవారి వ్యవహారాల్లో తలదూర్చవద్దు.



కర్కాటక రాశి
ఈ రోజంతా మీరు బిజీగా గడుపుతారు. కొత్త బాధ్యతలు తీసుకునేందుకు మీరు సందేహిస్తారు. మీ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక పనులు మీపై పడవచ్చు. మీ ప్రయత్నాలలో కొంత లోపం ఉంటుంది..సరిద్దుకోండి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో ప్రశంసలు అందుకుంటారు



సింహ రాశి
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. కార్యాలయంలో ఉద్యోగులు కొత్తగా ట్రై చేస్తారు. పనిని నెమ్మదిగా చేస్తారు కానీ మంచి మార్కులు కొట్టేస్తారు. వ్యాపార సమావేశాల్లో మీదే పైచేయి అవుతుంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించండి.



కన్యా రాశి
భావోద్వేగాల ఆటుపోట్లు వేగంగా ఉంటాయి. మీ ప్రవర్తన మీ చుట్టూ ఉన్న వ్యక్తులను గందరగోళానికి గురి చేస్తుంది. మీరు తక్షణ ఫలితాలను కోరుకుంటే నిరాశ తప్పదు. ఖర్చులు నియంత్రించేందుకు ప్రయత్నించండి.



తులా రాశి
ఈ రోజు మీ రోజు మిశ్రమంగా ఉంటుంది. మీ మనస్సుకు నచ్చినవిధంగా అన్ని పనులు పూర్తి చేస్తారు. అతి ఏకాగ్రత వల్ల పనులు కొంత దెబ్బతింటాయి. ఏకపక్ష ఆలోచన మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. ఉద్యోగులు, వ్యాపారులుకు శుభసమయం.



వృశ్చిక రాశి
విద్యార్థులు, కళాకారులు, క్రీడాకారులకు ఈ రోజు మంచి రోజు. తండ్రివైపునుంచి కొంత ప్రయోజనం ఉంటుంది. నైతిన స్థైర్యం ఉంటుంది. పనులు పూర్తిచేయడంలో పూర్తిస్థాయిలో సక్సెస్ అవుతారు. బయటి ఆహారానికి దూరంగా ఉండడం మంచిది.



ధనుస్సు రాశి
మీ చుట్టూ ఉన్న అడ్డంకులకు, మీ పురోగతికి అడ్డుపడే వారినుంచి బయటపడే సమయం వచ్చింది. కొత్త ఆర్థిక ఒప్పందాలు ఖరారు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతల భారం పెరుగుతుంది, ఇది మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది.



మకర రాశి
ఈ రోజు మీ రోజు.. బాగుంటుంది. బద్ధకాన్ని వీడండి. రెగ్యులర్ గా చేసేపనులు చేసుకుపొండి కానీ కొత్తగా ట్రై చేయవద్దు. పిల్లల కారణంగా కొంత చికాకు ఉండొచ్చు. మాటతీరు సరిగా ఉండేలా చూసుకోండి. సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి.



కుంభ రాశి
ఈ రోజు మీకు సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రత్యేక సవాలేమీ ఉండదు. ఓ ముఖ్యమైన పనికోసం ప్రయాణం చేయాల్సి రావొచ్చు. సాధ్యమైనంత వరకు సానుకూలంగా ఉండండి. ఆచరణ సాధ్యం కాని విషయాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు..ఓసారి ఆలోచించండి.



మీన రాశి
ఈ రోజు చేసే దాతృత్వ పనులు మీకు మానసిక శాంతిని, ఓదార్పును ఇస్తాయి. బ్యాంకు సంబంధిత లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యులతో తగాదా పెట్టుకోవద్దు. ఆరోగ్యం జాగ్రత్త.