ABP Desam


ఈ రాశివారు తొందరగా అలసిపోతారు
జనవరి 11 రాశిఫలాలు


ABP Desam


మేష రాశి
ఈ రోజు మీరు పనిలో చాలా యాక్టివ్ గా ఉంటారు. చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయడం ద్వారా మీరు ఉపశమనం పొందుతారు. మీ సానుకూల ప్రవర్తన అందర్నీ ప్రభావితం చేస్తుంది.ఉద్యోగులు, వ్యాపారులకు మంచిరోజు


ABP Desam


వృషభ రాశి
ఈ రోజు మీరు శారీరకంగా మరియు మానసికంగా అలసిపోయినట్టు ఫీలవుతారు. అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటంబంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టాలి.


ABP Desam


మిథున రాశి
చంచల స్వభావం మిమ్మల్ని బాధపెడుతుంది...దీన్ని నివారించేందుకు నడకకు వెళ్లండి.ప్రశాంతంగా శ్వాస తీసుకోండి. సానుకూల ఆలోచనలు మీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి పెట్టండి.


ABP Desam


కర్కాటక రాశి
ఈ రోజు ఓ పనిని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. జీవిత భాగస్వామితో ట్రిప్ కు వెళ్లడానికి ప్లాన్ చేయవచ్చు. ఆఫీసులో రోజు మామూలుగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పనిని పూర్తి చేయడంలో ఆటంకాలు ఉండవచ్చు.


ABP Desam


సింహ రాశి
ఈ రోజు సింహరాశి వారిలో ఉత్సాహం పెరుగుతుంది. ఉపాధి రంగానికి చెందిన వ్యక్తులు వారి కృషికి ప్రతిఫలం పొందుతారు. మీ కుటుంబం కారణంగా మీ వైవాహిక జీవితం ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు. వ్యాపారం బాగా సాగుతుంది.


ABP Desam


కన్యా రాశి
మీ ఒత్తిడి చాలావరకు తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితి కచ్చితంగా మెరుగుపడుతుంది కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇతరుల అభిప్రాయాన్ని వినడం, దానిని అమలు చేయడం చాలా ముఖ్యం. ఆనందం కోసం కొత్త సంబంధాన్ని వెతుక్కుంటారు.


ABP Desam


తులా రాశి
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. వ్యాపార రంగంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. సోమరితనం కారణంగా, మీరు కొన్ని ముఖ్యమైన పనులను పక్కనపెట్టేస్తారు. మీరు ఆరోగ్యంగా ఉండటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.


ABP Desam


వృశ్చిక రాశి
పాత పెట్టుబడుల వల్ల ఆదాయం పెరుగుతుంది. మీరు ఏదైనా వార్త కోసం ఎదురు చూస్తున్నట్లయితే, మీరు ఈ రోజు దానిని పొందవచ్చు. మీ జీవిత భాగస్వామితో తగాదాలు ఉంటాయి. ఎక్కువ ఒత్తిడి మీ సానుకూలతపై ప్రభావం చూపుతుంది


ABP Desam


ధనుస్సు రాశి
ఒత్తిడిని నివారించడానికి మీ విలువైన సమయాన్ని పిల్లలతో గడపండి. ప్రయాణం మీకు అలసట, ఒత్తిడిని ఇస్తుంది, కానీ ఇది ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటి వాతావరణం కారణంగా మీరు నిరాశకు గురవుతారు.


ABP Desam


మకర రాశి
ఈ రోజు మీ రోజు బాగుంటుంది. ఆర్థిక రంగంలో ఒడిదొడుకులు ఉంటాయి. ఈ రాశి వ్యాపారులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అదృష్టం మీకు కలిసొస్తుంది. మీరు సహనంతో చేసిన పనిలో విజయం సాధిస్తారు.


ABP Desam


కుంభ రాశి
ఈ రోజు అవివాహితుల నిరీక్షణ ఫలించే అవకాశం ఉంది. పెళ్లి సంబంధానికి సంబంధించి అప్ డేట్ ఉంటుంది. ఉద్యోగులు తమ స్వభావాన్ని కంట్రోల్ చేసుకోవాలి..మాట తూలకుండా ఉండాలి. వ్యాపారం బాగా సాగుతుంది.


ABP Desam


మీన రాశి
సమస్యల నుండి బయటపడటానికి స్నేహితుల సహాయం తీసుకోండి. గతం గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడడం మానేయండి. ఇది మీ మానసిక, శారీరక శక్తి క్షీణతకు దారితీస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులు పనిపై దృష్టి సారించండి.