కొంతమంది మహిళలు కబుర్లు మొదలుపెడితే.. ఎప్పటికి ముగుస్తాయో చెప్పడం కష్టమే. ఒకప్పుడు మహిళలంతా ఒక చోట గుమిగూడి ఊర్లో కబుర్లన్నీ షేర్ చేసుకొనేవారు. ఇప్పుడు మోబైల్ ఫోన్లు రావడంతో గడప దాడి బయటకు వెళ్ళకుండానే మొత్తం సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. సరే, ఇంట్లో ఉంటే టైంపాస్ కోసం ఫోన్ మాట్లాడుకున్నా తప్పులేదు. కానీ, రోడ్డు మీద కూడా అవే కబుర్లతో ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. మాటల్లో పడి లోకాన్ని మరిచిపోతున్నారు. రోడ్డు మీద ఫోన్ మాట్లాడటమే డేంజర్ అని మనం అనుకుంటే.. ఓ మహిళ ఏకంగా రైలు పట్టాల మీద నడుస్తూ ఫోన్ మాట్లాడుతూ పరిసరాలను మరిచిపోయింది. ఎదురుగా రైలు వస్తున్నా పక్కకి తప్పుకోకుండా పట్టాల మీదే నిలువగా పడుకుని ప్రాణాలు రక్షించుకుంది. ఆ క్షణంలో కూడా ఆమె ఫోన్ వదల్లేదు.. ఏమీ జరగనట్లుగానే వ్యవహరించింది. ఫోన్లో కబుర్లను కొనసాగించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. 


ఈ ఘటన హర్యానాలోని రోహ్తక్‌లో చోటుచేసుకున్నట్లు తెలిసింది. మహిళ ఫోన్ మాట్లాడుతూ ట్రాక్ దాటేందుకు ప్రయత్నిస్తుండగా ఆ పట్టాల మీదకు రైలు వచ్చింది. అయితే, ఆమె వేగంగా పక్కకి తప్పుకోడానికి బదులు పట్టాల మధ్యలో పడుకుంది. ఆమె మీద నుంచి రైలు వెళ్తున్నా ఏ మాత్రం బెదరకుండా ఫోన్ మాట్లాడింది. కొంచెం తేడా వచ్చినా ఆమె చనిపోయేది. అయితే, ఆమె మాత్రం తన ప్రాణం కంటే ఫోన్లో మాట్లాడటమే ముఖ్యమైనది అన్నట్లుగా కనిపించింది. ఈ వైరల్ వీడియో చూసిన నెటిజనులు ఆ మహిళను తిట్టి పోస్తున్నారు. అలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాలు పోతాయని అంటున్నారు. 


ఆ వీడియోను ఇక్కడ చూడండి:






గతేడాది హర్యానాకు చెందిన ఒక మహిళ, రైలు ఇంజిన్ నెమ్మదిగా కదులుతున్నప్పుడు రైలు ట్రాక్‌ మధ్యలో పడుకుని తన ప్రాణాలను రక్షించుకుంది. ఆ మహి గూడ్స్ రైలు కిందకి దూరి అవతలి వైపుకు వెళ్లేందుకు ప్రయత్నించింది. అప్పటి వరకు సిగ్నల్ కోసం వేచి ఉన్న ఆ రైలు ఒక్కసారే కదిలింది. దీంతో ఆమె వెంటనే ట్రాక్ మధ్యలో నిలువగా పడుకుంది. ఈ వీడియో కూడా అప్పట్లో వైరల్‌గా చక్కర్లు కొట్టింది. 






Also Read: అలా ఎలా? మలద్వారంలోకి చొచ్చుకెళ్లిన 2 కేజీల డంబెల్, ఇదేం పాడు అలవాటు భయ్యా!


Also Read: జాగ్రత్త, అంగస్తంభన కోసం ఇలా చేస్తే కళ్లు పోతాయ్! తాజా అధ్యయనం వెల్లడి