ఎంత అందంగా ఉందో..
సముద్రం లోతుల్లోకి వెళ్తే గానీ తెలియదు...లోపల ఎన్ని వింతలు, విశేషాలు ఉంటాయో. బయట ప్రపంచానికి తెలియనివెన్నో అక్కడ రోజూ జరిగిపోతూనే ఉంటాయి. అందులో నివసించే జలచరాల్లో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఎవరో ఒకరు ఆ లోతుల్లోకి వెళ్లి వాటిని ఫోటోలు, వీడియోలు తీస్తే "వావ్" అని ఆశ్చర్యపోతారంతా. ఇప్పుడలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సముద్రంలోని కొన్ని చేపలు "టోర్నడో" ఆకారంలో ఒక్క దగ్గరకు చేరిపోయాయి. సుడిగుండం వచ్చినప్పుడు నీళ్లు ఎలాగైతే గుండ్రంగా తిరుగుతాయో..అదే విధంగా ఈ చేపలన్నీ తిరుగుతూ కనిపించాయి. వందలాది చేపలు ఏ మాత్రం దారి తప్పకుండా ఇలా పద్ధతి ప్రకారం తిరుగుతున్న వీడియోను ఓ మరైన్ ఫోటోగ్రాఫర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన వాళ్లంతా చేపల కో ఆర్డినేషన్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే ఈ వీడియోకి 30 లక్షలకు పైగా వ్యూస్ రాగా, రెండున్నర లక్షల లైక్స్ వచ్చాయి. జపాన్‌కు చెందిన మరైన్ ఫోటోగ్రాఫర్ తాత్సురో తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఇలాంటి ఎన్నో వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేశాడు. సముద్రం లోతుల్లో ఉన్న అద్భుతాల్ని బయట ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. "బ్యూటిఫుల్ వీడియో" అంటూ అని కొందరు కామెంట్ చేస్తుంటే..మరికొందరు అమేజింగ్ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫినామినాని "మర్మరేషన్" (Murmuration)తో పోల్చుతున్నారు. ఒక్కోసారి కొన్ని వందల పక్షులు ఒక్క చోటకు చేరి, ఒకే మార్గంలో ఎగురుతూ వెళ్తాయి. ఆ సమయంలో ఓ విచిత్రమైన సౌండ్ చేస్తాయి. ఇప్పుడు చేపలు కూడా ఇదే విధంగా ఒకే డైరెక్షన్‌లో తిరుగుతుండటాన్ని చూసి ఇది కూడా మర్మరేషన్‌లాగే ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు.
Also Read: Commonwealth Games 2022: గోల్డ్ మెడల్ కొట్టిన సాక్షి మలిక్ ఎందుకు ఏడ్చింది!
Also Read: బింబిసార, సీతారామం పాజిటివ్ టాక్ తో టాలీవుడ్ కు మళ్లీ తెలిసొచ్చిందేంటి..?| ABP Desam