Viral Video: అదో పంక్చర్ షాప్. అక్కడే బైక్ మెకానిక్ చేస్తున్నాడో వ్యక్తి. మరో నలుగురు వ్యక్తులు అక్కడే ఉన్న యజమానితో ఏదో మాట్లాడుతున్నారు. అంతలోపే వారు నిల్చున్న శ్లాబు కూలిపోయింది. కింద డ్రైనేజీ ఉండగా.. ఐదుగురు వ్యక్తులు బైకుతో సహా అందులో పడిపోయారు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడే ఉ్నన సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ వీడియోను ఎవరో తీసి నెట్టింట పెట్టగా వైరల్ గా మారాయి. అయితే డ్రైనేజీ ఎక్కువ లోతుగా లేకపోవడంతో.. అందులో పడిపోయిన వ్యక్తులు బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. చిన్న చిన్న గాయాలు అయినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగనట్లుగా తెలుస్తోంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం వైరల్ గా మారింది.
ఈ వీడియోను జూన్ 21వ తేదీన ట్విట్టర్ అకౌంట్‌లో పెట్టగా.. ఇప్పటి వరకు 3.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. వేలల్లో లైకులు వందల్లలో కామెంట్లు వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. వీడియో అదిరిందని కొందరు, దేవుడు పిలుస్తున్నాడని మరికొందరు, వాళ్లకు తెలిసే ఇదంతా జరిగిందంటూ కొందరు తమ మనసులోని భావాలను వెల్లడిస్తున్నారు.
ఈ వీడియోను ఎవరికి నచ్చినట్టు వాళ్లు ప్రత్యర్థులపై ట్రోల్స్ చేసేందుకు వాడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలపై సెటైర్లు వేస్తూ ఓ వ్యక్తి దీన్ని పోస్టు చేశాడు.