Viral Video:


కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నట్టుండి వైరల్ అయిపోతాయ్. మరీ ముఖ్యంగా పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడేవి, సరదాగా అల్లరి చేసేవి అయితే మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చేస్తాయి. ఇప్పుడు కూడా సోషల్‌ మీడియాలో ఓ చిన్నారి వీడియో వైరల్ అయింది. ఆ చిన్నారి మాటలతోనే, అల్లరితోనో కాదు. అందరూ ఎమోషనల్ అయ్యే పని చేసి ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే...ఓ మెట్రో స్టేషన్‌లో కొందరు సైనికులు నిలబడి ఉన్నారు. బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఓ చిన్నారి వాళ్ల దగ్గరకు వెళ్లీంది. కాసేపు అలానే వారిని చూసింది. వచ్చీ రాని మాటలేదో మాట్లాడింది. ఈ చిన్నారిని చూసిన ఓ జవాన్‌ చిరు నవ్వు నవ్వాడు. వెంటనే ఆ చిన్నారి జవాన్ కాళ్లకు దండం పెట్టింది. ఆ పాప చేసిన పనికి షాక్ అయిన జవాన్ దగ్గరకు తీసుకున్నాడు. ప్రేమగా ముద్దు పెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టిన కాసేపటికే వైరల్ అయిపోయింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పాటు మరి కొందరు మంత్రులు ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. లక్షకుపైగా వ్యూస్‌ రాగా, వందలాది మంది షేర్ చేశారు.


 









Also Read: Gyanvapi Case: మసీదులో శ్రావణ మాసం పూజలు చేసుకోనివ్వండి, సుప్రీం కోర్టులో పిటిషన్