Viral News: మీరు అనేక ప్రేమ కథలు చూసి ఉంటారు. కానీ ఇది మాత్రం ఇంతుకుముందు ఎప్పుడూ చూడని, వినని ప్రేమ కథ. ఎందుకంటే పాకిస్థాన్‌కు చెందిన ఓ యువతి తన డ్రైవర్ కారు గేర్లు మార్చే స్టైల్ చూసి అతనితో ప్రేమలో పడింది. అంతేకాదు పెళ్లి కూడా చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది.


ఇదో వింత ప్రేమ కథ


ఖతీజా తండ్రి తన కూతురికి డ్రైవింగ్ నేర్పడానికి చబీ అనే వ్యక్తిని ఉద్యోగంలో పెట్టాడు. అక్కడే వారి ప్రేమ కథ మొదలైంది. కారు డ్రైవింగ్ నేర్చుకోవాల్సిన ఖతీజా.. చబీ దగ్గర ప్రేమ పాఠాలు నేర్చుకుంది. డ్రైవర్.. కారు గేరు మార్చే స్టైల్ చూసి అతనితో ప్రేమలో పడిపోయింది.  


డ్రైవింగ్ చేసే సమయంలో చబీ గేర్లు మారుస్తున్నప్పుడు అతని చేతులు పట్టుకోవాలని తాను టెంప్ట్‌ అయినట్లు ఆమె చెప్పింది. మొత్తానికి ఇంట్లో ఒప్పించి ఈ జంట ఒక్కటయింది. ఈ జంటకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. అయితే ఇంత చిన్న విషయానికి కూడా ప్రేమలో పడతారా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Also Read: Viral Video: తల్లడిల్లిన తల్లి హృదయం- పిల్లల్ని కాపాడిన ఎలుక, హార్ట్ టచింగ్ వీడియో!