Viral Video: తల్లి తన పిల్లలను కాపాడుకోవటానికి ఎంతకైనా తెగిస్తుంది. బిడ్డకు ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పిల్లలను ఆపద నుంచి అమ్మ రక్షిస్తుంది. మనుషుల్లో మాత్రమే కాదు జంతువుల్లో కూడా అమ్మ ప్రేమ అలానే ఉంటుంది. ఈ హార్ట్ టచింగ్ వీడియో చూస్తే మీరూ అదే మాట అంటారు.
పిల్లల కోసం
ఈ వీడియోలో కుండపోత వర్షం నుంచి ఎలుక తన పిల్లలను రక్షిస్తూ కనిపించింది. 2 నిమిషాల 20 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో భారీ వర్షం కురుస్తుండగా ఒక కలుగులో నుంచి ఎలుక బయటికి వచ్చింది. వర్షం కారణంగా ఆ కలుగులోకి నీరు వెళ్లిపోతుందని గమనించిన ఆ తల్లి ఎలుక.. తన పిల్లలను బతికించుకోవాలనుకుంది. పెద్ద వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా తన పిల్లలను కలుగులో నుంచి బయటికి తీసుకువచ్చింది.
ఎలుక తన అన్ని పిల్లలను నోటిలో పెట్టుకుని ఒక ఇంటి మెట్లపైకి దూసుకుపోతూ వాటిని వర్షానికి దూరంగా ఒక మూలన సురక్షితమైన ప్రదేశంలో ఉంచింది. నీటిలో మునిగిపోతున్న తన పిల్లలను రక్షించడానికి తల్లి ఎలుక చేసిన ప్రయత్నం నెటిజన్లను ఫిదా చేసింది. ఈ హార్ట్ టచింగ్ వీడియోను ట్విట్టర్లో ఫ్యాసినేటింగ్ అనే ఖాతా ద్వారా ట్విట్టర్లో అప్లోడ్ చేశారు.
Also Read: Viral Video: పులితో పరాచకాలా? కాదురా నాయనా ఇది అంతకుమించి!