Putin Dog Poop Painting | టీవల యూకేలోని ఓ పబ్‌ టాయిలెట్‌లో రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్(Vladimir Putin) ఫొటోను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పబ్‌కు ఎక్కడా లేని క్రేజ్ లభించింది. పుతిన్ ఫొటోపై మూత్రం పోసేందుకు కస్టమర్లు ఎగబడ్డారు. అయితే, దానివల్ల రష్యాపై ఉన్న కోపాన్ని తీర్చుకోగలిగారే గానీ, ఉక్రేయిన్‌(Ukrain)కు మాత్రం ఎలాంటి లాభం లేకపోయింది. కానీ, కుక్క మలంతో గీసిన పుతిన్ చిత్రానికి మాత్రం ప్రశంసలు లభిస్తున్నాయి. ఛీ, యాక్ కుక్క మలంతో పెయింటింగా? ఏంటా పాడుపని? అని అనుకుంటున్నారా? వినేందుకు ఇది కాస్త ఎబ్బెట్టుగానే ఉన్నా, ఉక్రేయిన్ శరణార్థులకు మాత్రం ఏదో ఒకలా ఉపయోగపడేలాగే ఉంది. 


బ్రిటీష్ కళాకారుడు డొమినిక్ మర్ఫి(Dominic Murphy) ఇటీవల తన కుక్క మలంతో పుతిన్‌ ఫొటోను చిత్రీకరించాడు. ఉక్రేయిన్‌పై రష్యా దాడిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డొమినిక్ తన వంతు సాయంగా ఉక్రేయిన్‌కు ఏదైనా చేయాలని భావించాడు. ఈ సందర్భంగా అతడికి ఓ కొత్త ఆలోచన వచ్చింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై నిరసన వ్యక్తం చేసేలా తన చిత్రం ఉండాలని అనుకున్నాడు. రెగ్యులర్‌ కలర్స్‌తో పుతిన్ చిత్రాన్ని గీస్తే.. అది పెద్ద కిక్ ఇవ్వదని భావించాడు. అప్పుడే అతడికి ఓ కొంటె ఐడియా వచ్చింది. తన కుక్క మలంతో పుతిన్ బొమ్మ గీయాలని నిర్ణయించుకున్నాడు. 


పుతిన్ బొమ్మను గీసేందుకు అవసరమైన మలాన్ని సేకరించాడు. దాని కంపును భరిస్తూనే పుతిన్ చిత్రాన్ని గీశాడు. ఈ చిత్రం గురించి డొమినిక్ ‘ఇన్‌సైడర్’ అనే మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘ఇది ఆగ్రహంతో చేసిన అపరిపక్వ ఆలోచన. కానీ, అది వేరేలా ఉపయోగించాలని అనుకున్నారు. ఈ చిత్రాన్ని మరిన్ని కాపీలు తీసి విక్రయించి, ఆ డబ్బును ఉక్రేయిన్ శరణార్థులకు విరాళంగా అందివ్వాలని నిర్ణయించుకున్నాను. కానీ, చాలామంది ఒరిజినల్ ఆర్ట్‌వర్క్ కోసం 3,900 డాలర్లు (రూ.2.30 లక్షల) వరకు ఇస్తామంటూ ఆఫర్స్ వస్తున్నాయి’’ అని తెలిపాడు. 
 
తన పెంపుడు కుక్క సిబిల్ వల్లే తాను ఈ చిత్రాన్ని గీయగలిగానని డొమినిక్ వెల్లడించాడు. అది మలం కావడం చాలా కంపు కొట్టేదని, వాసన రాకుండా ఉండేందుకు తన ముఖానికి ముసుగు వేసుకుని మరీ ఆ చిత్రాన్ని గీశానని తెలిపాడు. మలం ఎక్కువ రోజులు కాన్వస్‌పై ఉండదనే ఉద్దేశంతో మలంలో జిగురును కలిపానని పేర్కొన్నాడు. ఆ పెయింటింగ్ వాసన రాకుండా ఉండేందుకు సుమారు 30 సార్లు వార్నిష్ చేశానని తెలిపాడు. ఈ చిత్రానికి ‘పూ టిన్ షిట్’ (Poo Tin S**T) అని పేరు పెట్టాడు. 






రష్యాతో యుద్ధం చేయడానికి సిద్ధం ‘‘నా వయస్సు 20 ఏళ్లు ఉంటే తప్పకుండా రష్యాపై యుద్ధం చేయడానికి వెళ్లేవాడిని. కానీ నా వయస్సు 58 సంవత్సరాలు. గత 20 ఏళ్ల నుంచి పెయింటింగ్స్ చేస్తున్నాను. యుద్ధానికి ఎలాగో వెళ్లలేను, కనీసం ఈ విధంగానైనా ఉక్రేయిన్ బాధితులకు సాయం చేయాలనేది నా ఉద్దేశం. ఈ పూప్ పెయింటింగ్ (మలంతో గీసిన చిత్రం) ప్రింట్లను ఆందోళనకారులు నిరసన కార్యక్రమాల్లో వాడుకోడానికి తన వద్ద కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నాడు. అలా సేకరించిన సొమ్మును ఉక్రేయిన్‌కు విరాళంగా అందిస్తానన్నాడు.