Half Day Schools: తెలంగాణ విద్యాశాఖ(Educational Department) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు(Half Day Schools) నిర్వహించాలని నిర్ణయించింది. ఉద‌యం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 వ‌ర‌కు బ‌డులు నిర్వహిస్తారు. ఎండ‌లు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒంటిపూట బ‌డుల‌పై విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.  మే మూడో వారం వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.


ఏప్రిల్ 23 వరకు 


 ఒంటిపూట బడుల షెడ్యూల్ ను విద్యాశాఖ వెబ్‌సైట్ ఉంచనుంది. హాఫ్ డే స్కూల్ టైమింగ్స్, టైమ్ టేబుల్, పీరియడ్స్ ఇతర వివరాలను అందులో పేర్కొంటుంది. విద్యాశాఖ సంబంధిత అధికారులకు ఒంటిపూట బడులకు సంబంధించిన వివరాలను అందజేసింది. వేసవిలో ఒంటిపూట బడులకు సంబంధించి అన్ని పాఠశాలలకు టైమ్ టేబుల్ విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఒంటిపూట బడులు, సెలవులకు సంబంధించిన గైడ్ లైన్స్ ను అన్ని విద్యాసంస్థలకు అందిస్తామని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా విద్యాశాఖ హాఫ్ డేస్ ప్రకటించింది. మార్చి 16 నుంచి ఈ విద్యా సంవత్సలో చివరి పని దినం ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు.  అన్ని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఉన్నత పాఠశాలలు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు పని చేస్తాయి.


పదో తరగతి పరీక్షల షెడ్యూల్


తెలంగాణలో పదో తరగతి పరీక్షల(SSC Exams) షెడ్యూల్‌ విడుదల అయింది. మే 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు ఎస్‌ఎస్‌సీ బోర్డు(SSC Board) శుక్రవారం ప్రకటించింది. మే 18 నుంచి 20వ తేదీ వరకు ఓఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 9.30 గంటలకు నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందని తెలిపింది. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 


తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11న ఎథిక్స్, 12న హ్యుమన్ వాల్యూస్ పరీక్షలు జరపనున్నారు. త్వరలోనే పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల కానుంది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.