Tamilnadu Girl Made PM Modi Picture With Millets: ప్రధాని మోదీపై (PM Modi) తమిళనాడుకు చెందిన 13 ఏళ్ల చిన్నారి తన అభిమానాన్ని చాటుకుంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా 800 కేజీల తృణధాన్యాలతో ఆయన చిత్రాన్ని రూపొందించి అందరినీ అబ్బురపరిచింది. అంతేకాకుండా ప్రపంచ రికార్డు సాధించింది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు చెన్నైలోని (Chennai) కోల్పాక్కం ప్రాంతానికి చెందిన ప్రెస్లీ షెకీనా (13) స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో 8 తరగతి చదువుతోంది. ఈ నెల 17న (మంగళవారం) ప్రధాని మోదీ బర్త్ డే సందర్భంగా మిల్లెట్స్‌తో ఆయన చిత్రాన్ని రూపొందించి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయాలని భావించింది.
800 కేజీల మిల్లెట్స్‌తో..
ఇందుకోసం 800 కేజీల మినుములతో 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాని మోదీ భారీ చిత్రాన్ని గీసి అందరినీ అబ్బురపరిచింది ప్రెస్లీ షెకీనా. దాదాపు 12 గంటల పాటు శ్రమించి మోదీ చిత్రాన్ని రూపొందించి ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. ఈ అరుదైన ఘనత సాధించిన షెకీనాకు వరల్డ్ రికార్డు సొంతమైంది. యూనికో వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. వరల్డ్ రికార్డ్స్ డైరెక్టర్ ఆర్ శివరామన్ ఆమెకు ప్రపంచ రికార్డు సర్టిఫికెట్, మెడల్ అందజేశారు. కాగా, మిల్లెట్స్‌తో మోదీ చిత్రాన్ని రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: Chandra Babu:గ్రీన్ ఎనర్జీకి ఆకాశమే హద్దు- ఎలా అమలు చేయాలనేది కీలకం: ఏపీ సీఎం చంద్రబాబు