Ganesh Immersion 2024: గణేష్ నిమజ్జనం అంటే విగ్రహాలు నీటిలో వదిలేయడం కాదు- సమస్యలు, కోర్కెలు విడిచిపెట్టడం- ఇలా చేస్తేనే మానసిక ప్రశాంతత!

Khairatabad Ganesh Nimajjanam: గణేష్‌ నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా గణపతి విగ్రహాలను గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. ఇందులో సైకలాజికల్‌ సీక్రెట్స్‌ దాగి ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు

Continues below advertisement

Ganesh Visarjan 2024: పది రోజుల పాటు కోలాహలంగా సాగిన వినాయక చవితి వేడుకలు ముగింపు దశకు వచ్చాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వేల వినాయక విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుకున్నాయి. ఇప్పుడు ప్రధానమైన విగ్రహాలు నిమజ్జనానికి సిద్ధమవుతున్నాయి. దీని కోసం అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. 

Continues below advertisement

అసలు ఏంటీ నిమజ్జనం
గణేష్ విగ్రహ ఏర్పాటు కంటే నిమజ్జనం చాలా ప్రాధాన్యత ఉన్న క్రతువు. అందుకే ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వేడుకను నిర్వహిస్తుంటారు భక్తులు. నిమజ్జనం ఎందుకు చేయాలి.. ఎలా చేయాలనే విషయాలపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఏ కథ విన్న చదివినా ఫైనల్‌గా ప్రకృతితో ముఖ్యంగా మట్టితో ఉన్న అనుబంధాన్ని మాత్రం తెలియచేస్తున్నాయి. అందుకే వినాయక నిమజ్జనం మన పండకల్లో చాలా ప్రత్యేకమైన క్రతువుగా భావిస్తారు. 

నిజమైన నిమజ్జనం ఏంటీ?
వినాయకుడిని ఓ దేవుడిగానే కాకుండా ఓ సైకలాజికల్ లెసన్‌గా చూడొచ్చు. గణేషుడి పుట్టుక నుంచి నిమజ్జనం వరకు ప్రతి ఘట్టం కూడా ఓ పాఠాన్ని నేర్పిస్తుంది. జీవితంలో మనం ముందుకు సాగేందుకు తోడ్పాటు నందిస్తుంది. అందుకే అలాంటి స్ఫూర్తిదాయకమైన దేవుడికి తొలి పూజ చేస్తాం. అదే స్ఫూర్తితో జీవితంలో కష్టనష్టాలను ఎదుర్కొంటాం. 

ఈ క్రమంలో నిమజ్జన టైంలో కీలక నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. నిజమైన నిమజ్జనం అంటే ఇదేనంటూ చెప్పుకొస్తున్నారు. నిమజ్జనం టైంలో కోర్కెలు లేదా సమస్యల చిట్టాను కూడా గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేయాలని సూచిస్తున్నారు. అదే నిజమైన అసలైన నిమజ్జనమని  అంటున్నారు. 

నిమజ్జనం రోజున ఓ కాగితాన్ని లేదా ఓ తెల్లని వస్త్రాన్ని తీసుకొని కోర్కెల చిట్టాల, సమస్య చిట్టాను రాయాలి. కాగితంలోని పైభాగంలో స్వస్తిక్‌ గుర్తు వేయాలి. పసుపుతో ఈ గుర్తు వేయాలి. తర్వాత 'ఓం గన్ గణపతయే నమః' అనే మంత్రాన్ని రాయాలి. 

గణేషుడి మంత్రం రాసిన తర్వాత మీ కోర్కెలు, సమస్యలను ఒక్కొక్కటిగా వివరంగా రాయాలి. పూర్తైన తర్వాత చివర్లో మరోసారి పసుపుతో స్వస్తిక్‌ గుర్తు వేసి చిట్టాను ముగించాలి. అంతరం జాగ్రత్తగా మడత పెట్టి రక్ష సూత్రంతో కట్టాలి. అంటే పసుపు లేదా ఎరుపు దారంతో గట్టిగా కట్టాలి. ఇలా రక్ష సూత్రంతో కట్టిన కోర్కెల చిట్టాను జాగ్రత్తగా వినాయక నిమజ్జనం టైంలో గంగలో కలిపేయాలి   

ఇలా చీటీ రాసి నిమజ్జనం చేయడమంటే అక్కడో వాటిని వదిలేయాలని ఆ భారం దేవుడిపై వేసి మీ పని మీరు చేసుకోవాలని అర్థం. అంతేకాని వాటి కోసమే ఆలోచిస్తూ అనారోగ్యం పాలు కావద్దని ఈ క్రతువు సూచిస్తుంది. అందుకే ఇలా చేయడం వల్ల మానసిక ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని సలహా ఇస్తున్నారు. 

ఇలా కోర్కెలు, సమస్యలు నిమజ్జనం చేయడం వల్ల డిప్రషన్ తగ్గుతుందని అంటారు. చాలా మంది తమకు ఉన్న సమస్యలను కానీ, కోర్కెలను బయటకు చెప్పుకోలేదు. అవి తీరకపోవడంతో చాలా డిప్రషన్‌కు గురి అవుతుంటారు. ఇలా చీటీ రాసి నిమజ్జనం చేయడంతో మనసులోని బాధ, భయం కొంత పోతుంది. మనసులోనే దాచుకుంటే డిప్రషన్‌కు గురై అనారోగ్యం పాలయ్యే చాన్స్ ఉంది. అలాంటి ప్రమాదాలు లేకుండా చేసుకోవచ్చుని చెబుతారు.  

Continues below advertisement