Global RE-Invest Renewable Energy Investors Meet : గ్రీన్ ఎనర్జీ వినియోగంలో అపరిమితమైన అవకాశాలు ఉన్నాయని అయితే దాన్ని ఎలా అమలు చేయాలనేదే కీలకాంశమని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరుగుతున్న నాల్గో గ్లోబల్‌ రీ అన్వెస్ట్ రెన్యూవబల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్‌ అండ్ ఎక్స్‌పోలో ఆయన పాల్గొన్నారు. 


గుజరాత్‌లో పీటీఐ మీడియా ఏజెన్సీతో మాట్లాడుతూ... "గ్రీన్ ఎనర్జీకి ఆకాశమే హద్దు. భవిష్యత్తులో దీనిని ఎలా అమలు చేయాలనేది చాలా కీలకం. ఇప్పుడు ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూ ఇయింగ్ బిజినెస్‌కు మారాల్సిన టైం వచ్చింది. ఈ మార్పుకు మద్దతు ఇచ్చే వాతావరణాన్ని సృష్టించుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది."






"మనం పోటీ విధానాలు అభివృద్ధి చేయాలి. ప్రతి అంశాన్ని రియల్ టైంలో నిర్వహించేలా చూసుకోవాలి. సౌర ఫలకాలను తయారు నుంచి గ్రీన్ హైడ్రోజన్‌ను ఎగుమతి చేయడం వరకు ఆంధ్రప్రదేశ్‌లో చాలా అవకాశాలు ఉన్నాయి." అన్నారాయన.


ముఖ్య వక్తలలో ఒకరైన ఆంధ్రా సిఎం రాష్ట్రంలో అన్‌టాప్డ్‌ గ్రీన్ ఎనర్జీ సెక్టార్‌లో పెట్టుబడుల ఆహ్వానం కోసం ఇక్కడకు వచ్చారు.