Tamil Nadu: ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ నడిరోడ్డుపై అనుచితంగా ప్రవర్తించాడు. ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌ను అకారణంగా దారుణంగా కొట్టాడు. తమిళనాడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.






ఇదీ జరిగింది


సింగనల్లూరు పోలీస్ స్టేషన్‌లో పరిధిలో ఓ స్కూల్‌కు చెందిన బస్సు డ్రెవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసి బైక్‌లను, పాదచారులను ఢీకొట్టబోయాడు. ఆ సమయంలో స్విగ్గీకి చెందిన డెలివరీ బాయ్‌ మోహన సుందరం బస్సును ఆపి డ్రైవర్‌ను నిలదీశాడు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. అయితే ఇది గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడికి వచ్చాడు. 


ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పని నీది కాదు మాది అంటూ డెలివరీ బాయ్‌ చెంపపై పదే పదే కొట్టాడు. అంతటితో ఆగని కానిస్టేబుల్ సతీశ్.. డెలివరీ బాయ్ సెల్‌ఫోన్‌ను లాక్కొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంతేకాకుండా మోహన సుందరాన్ని తిడుతూ ఆ స్కూల్‌ బస్సు ఓనర్‌ ఎవరో తెలుసా అని కానిస్టేబుల్ అన్నాడు. 


వీడియో వైరల్






ఈ ఘటనను పక్కనే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. వీడియో వైరల్‌గా మారి పోలీసు ఉన్నతాధికారులకు చేరింది. దీంతో కానిస్టేబుల్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. వెంటనే కానిస్టేబుల్‌ను కోయంబత్తూరులోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బదిలీ చేశారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు డెలివరీ బాయ్‌పై చేయిచేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారం ఉందని ఇలా సామాన్యులను పోలీసులు ఎలా కొడతారని కామెంట్లు చేస్తున్నారు.


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 4,270 కరోనా కేసులు- 15 మంది మృతి


Also Read: Corbevox Booster Dose:మరో బూస్టర్ డోస్ వచ్చేస్తోంది, డబుల్ ఇమ్యూనిటీ గ్యారెంటీ