Corona Cases: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 4,270 మంది వైరస్ బారిన పడ్డారు. 15 మంది మృతి చెందారు. తాజాగా 2,619 మందికిపైగా కరోనా నుంచి రికవరయ్యారు. రికవరీ రేటు 98.73 శాతానికి చేరింది. డైలీ పాజిటివిటీ రేటు 1.03 శాతం ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 0.44 శాతంగా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.







  • మొత్తం కరోనా కేసులు: 4,31,76,817

  • ‬మొత్తం మరణాలు: 5,24,692

  • యాక్టివ్​ కేసులు: 24,052

  • మొత్తం రికవరీలు: 4,26,28,073


ఆ రాష్ట్రాల్లో


కేరళలో ఒక్కరోజే 1,544 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో వరుసగా మూడోరోజు వెయ్యికిపైగా కొత్త కేసులు వచ్చాయి.


వ్యాక్సినేషన్







దేశవ్యాప్తంగా కొత్తగా 11,92,427 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,94,09,46,157కు చేరింది. మరో 4,13,699 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. కరోనా ఫోర్త్ వేవ్‌ అంచనాల నడుమ కొవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.


Also Read: Corbevox Booster Dose:మరో బూస్టర్ డోస్ వచ్చేస్తోంది, డబుల్ ఇమ్యూనిటీ గ్యారెంటీ


Also Read: JEE Main: జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డ్‌ ఎప్పుడు ఇస్తారంటే?