Russia Ukraine War: 'పుష్ప' స్టైల్‌లో పుతిన్‌కు కేఏ పాల్ వార్నింగ్! పాల్ ఫైట్, RGV ట్వీట్!

ABP Desam Updated at: 28 Feb 2022 08:04 PM (IST)
Edited By: Murali Krishna

కేఏ పాల్ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు పుష్ప మూవీలో డైలాగ్‌తో పాల్ వార్నింగ్ ఇచ్చారు.

పుతిన్‌కు కేఏ పాల్ వార్నింగ్

NEXT PREV

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రపంచ శాంతి దూత కేఏ పాల్ వార్నింగ్ ఇచ్చారు. 'తగ్గేదేలే' అంటూ పుష్ప సినిమా డైలాగ్‌తో పుతిన్‌ను కేఏ పాల్ హెచ్చరించిన వీడియోను ఆర్జీవీ ట్వీట్ చేశారు.






"పుతిన్.. ప్రార్థన చేస్తున్నాము.. తగ్గేదేలేదు.. గుర్తుంచుకో" అంటూ వీడియోలో పాల్ చెప్పిన డైలాగ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.


పాల్ కన్నీరు


రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై కేఏ పాల్ ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్‌కు మతిస్థిమితం లేదన్నారు. యుద్ధాన్ని ఆపేందుకు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నానన్నారు పాల్.



21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాను. పరిస్థితులను తలచుకుని నా కంట్లో కన్నీరు ఆగడం లేదు. ఉక్రెయిన్‌పై రష్యా వెంటనే యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. తమ సైనికులను ఉక్రెయిన్‌కు పంపించాలని గత నెలలోనే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను నేను కోరాను. అప్పుడు ఓకే చెప్పిన బైడెన్. ఇప్పుడు వెనక్కి తగ్గారు.                                                  - కేఏ పాల్, ప్రపంచ శాంతి దూత


యుద్ధం


5 రోజులుగా ఉక్రెయిన్‌లో రష్యా బాంబుల మోత మోగిస్తోంది. రాజధాని కీవ్ సహా ఇతర నగరాలను అధీనంలోకి తీసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. క్షిపణి ప్రయోగాలు, తుపాకీ తూటాలు, బాంబుల మోతతో ఉక్రెయిన్ మార్మోగుతోంది. అయినప్పటికీ ఉక్రెయిన్ పోరాటం ఆపడం లేదు.


రష్యా సైన్యాన్ని ఎదుర్కొనే విషయంలో జెలెన్‌స్కీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమ సరిహద్దులు దాటి లోపలికి వచ్చిన వందల మంది రష్యన్‌ సైనికులు హతమయ్యారని స్పష్టం చేశారు. శత్రు దురాక్రమణను ఉక్రెయిన్‌ వీరోచితంగా తిప్పికొడుతోందని ఆయన అన్నారు. ప్రపంచ దేశాలు తమకు సాయం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. 


Also Read: Ukraine-Russia War: ఉక్రెయిన్ అధ్యక్షుడే రష్యా టార్గెట్- జెలెన్‌స్కీని చంపేందుకు 400 మంది ఉగ్రవాదులు


Also Read: Russia Ukraine War: మన ఆడపిల్లలపై ఉక్రెయిన్ సైనికుల వేధింపులు- కాలితో తన్ని నెట్టేస్తోన్న వీడియో వైరల్

Published at: 28 Feb 2022 07:43 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.