అనగనగా ఓ జర్నలిస్ట్... అతడి పేరు మారన్! మామూలు జర్నలిస్ట్ కాదు... అతనో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. అతడిని కంట్రోల్ చేయాలని రాజకీయ నాయకులు చాలా ప్రయత్నిస్తున్నారు. ఎందుకు? మారన్ ఏం చేశాడు? అసలు, అతడి నేపథ్యం ఏమిటి? అతడు ఎవరు? అనేది తెలియాలంటే... మార్చి 11న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికలో విడుదలకు రెడీ అయిన 'మారన్' సినిమా చూడాలి.
ధనుష్, మాళవికా మోహనన్ జంటగా నటించిన చిత్రమే 'మారన్'. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. తెలుగులోనూ విజయం సాధించిన 'డీ 16', అరుణ్ విజయ్ 'మాఫియా: ఛాప్టర్ 1', 'నవరస' వెబ్ సిరీస్‌లో 'ప్రాజెక్ట్ అగ్ని' ఎపిసోడ్ ఆయన దర్శకత్వం వహించినవే. ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా 'మారన్'. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.
Also Read: రజనీకాంత్ రెండో కూతురు రెండో పెళ్లికి ధనుష్ చేసిన సాయం ఇదే!
ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మారన్ పాత్రలో ధనుష్, అతడి ప్రేయసిగా మాళవికా మోహనన్ కనిపించారు. సినిమాలో లవ్ స్టోరీ కూడా ఉందని ట్రైలర్ లో వాళ్ళిద్దరి సీన్స్ చూస్తే తెలుస్తోంది. యాక్షన్ కూడా ఉంది. 'మనం రాసేది ప్రజలకు నచ్చేలా ఉండాలి' అని సీనియర్ జర్నలిస్ట్ చెబితే... 'వాళ్ళకు నచ్చేలా ఉండకూడదు సార్. ప్రజలకు నిజాన్ని తీసుకువెళ్లి చేర్చేలా ఉండాలి' అని ధనుష్ బదులు ఇవ్వడం ఆకట్టుకునేలా ఉంది. రాజకీయ నాయకుడిగా సముద్రఖని కనిపించారు. మొత్తం మీద ట్రైలర్ ప్రామిసింగ్ గా కనిపించింది. సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: ఇప్పుడూ రజనీకాంత్ అల్లుడు అంటారా? ఆ ట్యాగ్ నుంచి ధనుష్ బయటకొచ్చాడా? లేదా?