Rain In 6 Feet In Hyderabad: ఓ చోట వర్షం పడితే మరో చోట వర్షం పడకుండా ఉండడం చూశాం. ఓ చోట భారీ వర్షం పడితే మరో చోట మేఘాలు కమ్ముకోవడం తెలుసు. అదే ఓ చోట వర్షం పడుతుంటే మరో చోట ఎండ కాయడమూ చూశాం. అలాగే, ఎండా వాన రెండూ ఒకేసారి పడడం కూడా మనం చూశాం. అయితే, హైదరాబాద్‌లో (Hyderabad) గురువారం ఓ విచిత్రం జరిగింది. కేవలం ఓ ప్రాంతంలో 10 మీటర్ల పరిధిలో మాత్రమే వర్షం పడింది. హైదరాబాద్ - మురద్‌నగర్ కాలనీలో మేఘానికి చిల్లు పడిందా అన్న రీతిలో కేవలం ఒక్క ఇంటి ముందే ఆరడుగుల వ్యాసార్థంలో వర్షం పడింది. దీన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీన్ని వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Viral Video: పొలంలో భారీ మొసలి - కూలీల షాక్, వైరల్ వీడియో