కొంతమంది రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోయిన కథలు మనం ఇప్పటికే చాలా విన్నాం. అయితే తాజాగా ఇలాంటి వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుంది. పనికి రాదని స్క్రాప్‌కు వేసిన ఒక పాత ఏటీయం మెషీన్‌ని డిస్ఇంటిగ్రేట్ చేసేటప్పుడు అందులో దాదాపు రూ.1.5 లక్షల వరకు నగదు ఉండటంతో దాన్ని డిస్ఇంటిగ్రేట్ చేసిన వారు పండగ చేసుకుంటున్నారు.
ఈ వీడియోలో ఒక పాత ఏటీయంని ఇద్దరూ విడిభాగాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ మెషీన్‌కి సంబంధించిన తాళం పోవడంతో కొంతమంది దాన్ని స్క్రాప్‌కు వేశారు. దాన్ని ఇంటి దగ్గర కొనుగోలు చేసిన వ్యక్తి, తన స్నేహితుడు కలిసి ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు.
మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. ఈ మెషీన్‌ను ఆ వ్యక్తి 300 డాలర్లకు(మనదేశ కరెన్సీలో సుమారు రూ.22,400) కొనుగోలు చేశారు. దీన్ని కొనుగోలు చేసినప్పుడు అమ్మిన వ్యక్తి తాళం ఇవ్వలేదు. దీంతో ఏటీయంను బద్దలు కొట్టాల్సి వచ్చింది. సుత్తి, డ్రిల్, ఇతర పనిముట్లతో దీన్ని తెరవడానికి ప్రయత్నించి చూసినప్పుడు అతను షాకయ్యాడు.
ఇందులో 2,000 డాలర్ల(మనదేశ కరెన్సీలో సుమారు రూ.1.5 లక్షలు) వరకు ఉంది. ఈ నగదును చూడగానే.. అతను ఆనందంతో గంతులు వేశాడు. అనంతరం ఈ వీడియోను టిక్‌టాక్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోపై ప్రజలు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూనే ఉన్నారు.
ఏటీయం నుంచి డబ్బులు వచ్చాక.. ఈ వీడియో తీసిన వ్యక్తి తన కొలీగ్స్‌ని కలిశాడు. వారంతా ఈ వీడియోని షేర్ చేస్తూ ఇది తమ జీవితంలో అత్యుత్తమ రోజని తెలిపారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. ఈ వీడియోలో వారికి దొరికింది డాలర్స్ కాబట్టి అమెరికాలోని ఏదో ఒక ప్రాంతంలో ఈ సంఘటన జరిగి ఉంటుంది. అయితే స్క్రాప్ చేసిన ఏటీయంలో ఇంత మొత్తంగా నగదు ఉండటం అంటే మాత్రం అదృష్టం అనే చెప్పాలి.
Watch: Viral Video: కారు కోసం కొట్టుకున్నారు... వైరల్ అవుతున్న ఒంగోలు స్ట్రీట్ ఫైట్
Also Read: Sucker Mouth Cat Fish: జాలర్లకు చుక్కలు చూపిస్తున్న దెయ్యం చేప... ఇది ఎంత ప్రమాదకరమో తెలుసా!
Watch: King Cobra Video: ప్రత్తిపాడులో 12 అడుగుల కింగ్ కోబ్రా... చూసిన జనాలు పరుగో పరుగు