Kalki 2898 AD Ganesh Viral Video: వినాయక చవితి అంటేనే సందడి. పలు రూపాల్లో కొలువుదీరిన గణనాథులను చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ఏ రూపంలోనైనా ఒదిగిపోయే గణపయ్యను భక్తులు పలు రూపాల్లో తయారు చేసి పూజిస్తుంటారు. అప్పటి ట్రెండింగ్ అవుతున్న వాటిని బట్టి వినాయక విగ్రహాలను తయారు చేస్తుంటారు. తాజాగా, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి' వినాయకుడి విగ్రహం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో బాహుబలి, పుష్ప వినాయక విగ్రహాలు అందరినీ ఆకట్టుకోగా.. ఇప్పుడు 'కల్కి' వినాయకుడు ట్రెండ్ అవుతున్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'కల్కి 2898 ఏడీ' ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో భైరవ పాత్రలో ప్రభాస్, అశ్వత్థామగా బిగ్‌బీ అమితాబ్, యాస్కిన్‌గా కమల్ హాసన్ తమ నటనతో మెప్పించారు. ముఖ్యంగా 'కల్కి' వెహికల్ బుజ్జి అందరినీ ఆకట్టుకుంది.


కాంప్లెక్స్ నుంచి లోపలికి వెళ్లేలా..


ఇప్పుడు 'కల్కి' (KALKI 2898 AD) సినిమాను పోలేలా ఓ వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తమిళనాడులోని (Tamilnadu) కృష్ణగిరి జిల్లాలో కల్కి సెట్ లా ఓ మండపాన్ని నిర్మించారు. కాంప్లెక్స్ నుంచి లోపలికి వెళ్లేలా దాన్ని డిజైన్ చేశారు. లోపల కమల్ హాసన్ పాత్రకు సంబంధించిన బొమ్మ పెట్టి.. శివుని విగ్రహం, అశ్వత్థామగా వినాయకుడిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గతంలో పుష్ప, బాహుబలి వినాయకుడి విగ్రహాలు అందరినీ ఆకట్టుకోగా.. ఇప్పుడు 'కల్కి' వినాయకుడి విగ్రహం మరింత పాపులర్ అయ్యింది. 






Also Read: Birth place of Ganesha : గణేషుడు పుట్టింది ఆ గ్రామంలోనే ! అక్కడకు ఎలా వెళ్లాలో తెలుసా ?