Tallest Ganesha was installed in VisakhaPatnam : గణేశుడి అవతారాలు ఎన్ని ఉంటాయో చెప్పడం కష్టం. నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే పందిళ్లలోకి వెళ్లి చూస్తే వినాయకుడు  రూపాలకు అంతే ఉండదని అర్థమవుతుంది. భక్తులు ఎవరి అభిరుచులకు అనుగుణంగా వారు గణేశుడ్ని రెడీ చేశారు. ఇలా విశాఖలో కొంత మంది గణేశుని భక్తులు 89 అడుగుల అతి పెద్ద వినాయకుడ్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే బెల్లంతో తయారు చేయడం.  


రెండు నెలల పాటు శ్రమించి బెల్లం వినాయకుడి రూపకల్పన                 


డబ్బులతో, డ్రై ఫ్రూట్స్ తో.. వంట పాత్రలో.. మెకానిక్ సామాన్లతో గణేశుడ్ని తయారు చేస్తున్నట్లుగానే విశాఖలోని కొందరు వ్యాపారులు  బెల్లంతో అతి పెద్ద వినాయుక్డని తయారు చేయాలనుకున్నారు. అంతే రెండు నెలల ముందుగానే పనులు ప్రారంభించారు. కనీసం ఇరవై టన్నుల బెల్లం అవసరం పడుతుందని గుర్తించారు. అత్యంత నాణ్యమైన బెల్లాన్ని రాజస్థాన్ నుంచి  దిగుమతి చేసుకున్నారు. రెండు నెలల పాటు శ్రమించి 89 అడుగుల అతి పెద్ద వినాయక విగ్రహాన్ని  సిద్ధం చేశారు. 


ముస్లిం దేశంలో కరెన్సీ నోట్లపై గణేశుడు - ఎక్కడో తెలుసా ?


నిమజ్జనం రోజున భక్తులకు పంచనున్న నిర్వాహకులు           


చవితి రోజున పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు చేశారు. రోజూ పలువురు ప్రముఖులు వచ్చి  బెల్లం వినాయకుడ్ని దర్శించుకుంటున్నారు. అయితే ఇప్పుడీ వినాయకుడ్ని ఎలా నిమజ్జనం చేస్తారన్న సందేహం చాలా మందికి ఉంటుంది. మామూలుగా అయితే నిమజ్జనం అంటే తీసుకెళ్లి నది లేదా సముద్రంలో కలుపుతూంటారు. అందుబాటులో ఉంటే చెరువుల్లో కలుపుతారు. అయితే గాజువాకలో పెట్టింది బెల్లం విగ్రహం కాబట్టి పండితులతో చర్చించి నిర్వాహకులు ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే..  వినాయకుడ్ని భక్తులకు పంచడం. అంటే బెల్లం గణేశుడ్ని భక్తులకే ప్రసాదం రూపంలో ఇస్తారన్నమాట.      


గణేషుడు పుట్టింది ఆ గ్రామంలోనే ! అక్కడకు ఎలా వెళ్లాలో తెలుసా ?


వేల మంది భక్తులకు ప్రసాదంగా బెల్లం వినాయకుడు                                                           


నిమజ్జనం రోజు ప్రత్యేక పూజలు చేసి..  సంప్రదాయకంగా నిమజ్జన క్రతువును లాంఛనంా పూర్తి చేసిన తర్వాత బెల్లం గణేషుడ్ని భక్తులకు పంచడం ప్రారంభిస్తారు. ఇరవై టన్నుల బెల్లం కాబట్టి.. కొన్ని వేల మంది  భక్తులకు అందే అవకాశం ఉంటుందని అంచనా. గతంలో ఎక్కువగా ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను పెట్టేవారు. పూర్తి స్థాయిలో మట్టిని ఉపయోగించేవారు. ఉన్న చోటనే నీళ్లతో నిమజ్జనాన్ని పూర్తి  చేసేవారు. ఈ సారి మాత్రం కొత్త పద్దతి  పాటిస్తున్నారు.