Birthplace of Ganesha is three thousand meters above sea level : వినాయక చదుర్థి వస్తే  పిల్లలు, పెద్దలు అందరికీ పండుగే. పండగను చేసుకోవడమే కాదు.. వినాయకుడి జననం గురించి కూడా చదువుకుంటారు. కథను పిల్లలు ఆసక్తిగా తెలుసుకుంటారు. అయితే గేణశుడు ఎక్కడ పుట్టాడన్నది మాత్రం క్లారిటీగా ఉండు. 


వినాయకుడ్నిపార్వతీ దేవి సృష్టించింది దోడితాల్ సరస్సు ఒడ్డున           


తల్లి పార్వతీ దేవి స్నానానికి వెళ్లినప్పుడు వినాయకుడ్ని కాపలాగా పెట్టి వెళ్లింది. ఆ సమయంలో వచ్చిన శివుడు వెళ్లేందుకు ప్రయత్నిస్తే వినాయకుడు అడ్డుకున్నాడు. ఆగ్రహంతో శివుడు వినాయకుడు తల తెంపేస్తాడు. ఆ నినాయకుడు పార్వతీదేవి బిడ్డ అని శివుడిగా తెలియదు.  శివుడు మనుషులకి పుట్టిన వాడు కాదని ఆయన్ని యక్ష స్వరూపుడు అంటారని పురాణాలు చెబుతున్నాయి.  ఈ కారణంచేత పార్వతి శివుని బిడ్డకి తల్లి అయ్యే అవకాశం ఉండదు.. అందుకని  ఒంటరితనం వల్ల,  మాతృభావన వల్ల  తను ఓ బిడ్డను సృష్టించి ప్రాణం పోయాలని నిర్ణయించుకుంటుంది. ఆ ప్రకారం తన శరీరంపై ఉన్న గంధాన్ని తీసి, అక్కడి మన్నుతో కలిపి ఓ బిడ్డను తయారు చేసి ప్రాణం పోస్తుంది. శివుడు ఒక చోట నిలిచే భర్త కాదు. సంచారంలో ఏళ్లు గడిచిపోతూండేవి. 


ఊరందరూ ఒక్కటే - ఊరికి ఒక్కటే గణేష్ మండపం ! ఈ ఐక్యత ఎక్కడో కాదు


తెలియక తల తీసేసిన శివుడు - తన గణాలలో ఒకరి తల అమరిక


పార్వతీదేవి  తనయుడికి పదేళ్లు వచ్చిన తర్వాత  శివుడు తన గణాలతో పాటు పార్వతిదేవి నివాసానికి తిరిగి వస్తాడు. అంతకు ముందే  పార్వతి దేవి స్నానానికి  వెళ్తూ  అటుగా ఎవరూ రాకుండా చూడుమని చెప్తుంది. ఈ పిల్లాడు శివుణ్ణి ఎప్పుడూ చూడలేదు.. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ,  పిల్లాడు ఆయన్ని అడ్డగిస్తాడు. అప్పుడు శివుడు, పిల్లాడి తల తీసేసి, పార్వతి దగ్గరికి  వెళ్తాడు. పార్వతీ విషయం తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేస్తే ఆమె  కోపాన్ని చల్లార్చడానికి తన గణాలలో ఒకరి తల తీసి ఆ పిల్లవాడికి పెడతాడు. ఇది వినాయకుని కథ. 


గణేష్ నిమజ్జనం 11వ రోజే ఎందుకు..ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా!


ఉత్తరాఖండ్‌లోని  దోడితాల్ సరస్సు కు ప్రత్యేకత


ఇంత వరకూ  బాగానే ఉన్నా ఇదంతా ఎక్కడ జరిగిందంటే...హిమాలయ్యాలో అని చెప్పుకోవచ్చు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో దోడితాల్ అనే సరస్సు ఉంది. సముద్ర మట్టానికి 3,310 మీటర్ల ఎత్తులో  ఉన్న దోడితాల్  సరస్సు ఒడ్డునే వినాయక జననం జరిగింది. ఇక్కడ పార్వతీ సమేత గణేశ విగ్రహం కూడా ఉంది. ఈ సరస్సుకి ఓ ప్రత్యేకత ఉంది. ఎంత లోతు ఉందో  ఊహించడం కష్టం. 


పర్యాటకంగా  పెద్దగా ప్రాచుర్యం రాలేదు కానీ.. పట్టుబట్టి చూడాలనుకునేవారు పెద్ద ఎత్తున దోడితాల్ వెళ్తారు. ఉత్తరాఖండ్ లో అనేక మంది టూర్ ఆపరేటర్లు తీసుకెళ్తారు. డెహ్రాడూన్ నుంతి గణేశ జన్మస్థలం ప్రత్యేక టూరిజం సౌకర్యం ఉంటాయి.