Seethe Ramudi Katnam Serial Today Episode రేవతి తన ఇద్దరు అన్నయ్యలకు రాఖీ కట్టడానికి రెడీ అవుతుంది. జనా, గిరిధర్‌లు ఏం గిఫ్ట్‌లు ఇస్తారో అని సీత అంటుంది. ఇక గిరిధర్ ఎవరు ఏమనుకున్నా మేం మా చెల్లికి మంచి గిఫ్టే ఇస్తామని అంటాడు. జనార్థన్ మాత్రం మీరు ఎవరూ ఊహించని గిఫ్ట్ ఇస్తామని అంటాడు. రేవతి ఇద్దరు అన్నయ్యలకు రాఖీ కట్టి ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. జనార్థన్ రేవతికి డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ ఇస్తాడు. ఇక గిరిధర్ గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇస్తాడు. రేవతి సంతోషంతో ఇద్దరు అన్నయ్యల్ని హగ్ చేసుకుంటుంది. చలపతి ఇద్దరు బావల్ని పొగిడేస్తాడు. ఇద్దరు అన్నయ్యలు తమకు తమ చెల్లి అంటే ప్రాణం అని అంటారు. ఇక మహాలక్ష్మి జనార్థన్‌కి సైగ చేస్తుంది.


జనార్థన్: మాకు కావాల్సింది నీ థ్యాంక్స్ కాదు రేవతి నువ్వు మా మాట వినడం. 
గిరిధర్: మా మీద నీకు ప్రేమ ఉంటే మేం చెప్పినట్లు చేయాలి. 
జనార్థన్: మేం ఏం చెప్పినా చేస్తావా
రేవతి: నా వల్ల అయ్యేది అయితే తప్పకుండా చేస్తాను అన్నయ్య.
సీత: ముందు మీ కోరిక ఏంటో చెప్పండి మామయ్యలు.
జనార్థన్: నువ్వు కిరణ్‌ని పెళ్లి చేసుకోకూడదు. 
గిరిధర్: మేం చెప్పిన సంబంధమే చేసుకోవాలి. ఇదే నువ్వు మాకు ఇచ్చే గిఫ్ట్.
సీత: అది ఎలా కుదురు తుంది మామయ్యలు మీ కంటే పెద్ద గిఫ్ట్‌లు కిరణ్ గారు ఇవ్వగలరు. ఆయన డబ్బుతో పాటు ఎంతో విలువైన కాలాన్ని ఖర్చు చేశారు. మీరు తిట్టిన కొట్టినా ఇన్నేళ్లు రేవతి పిన్ని కోసం ఎదురు చూశారు. మీరు ఇచ్చిన ఈ గిఫ్ట్‌ల కంటే ఆయన కట్టే తాళి గొప్పది.
మహాలక్ష్మీ: రామ్ సీత ఎలా మాట్లాడుతుందో చూడు తనని కంట్రోల్ చేయ్.
రామ్: సీత మాట్లాడిన దాంట్లో తప్పేముంది. నిశ్చయతాంబూలం అయిన తర్వాత ఇలా అడగడం కరెక్ట్ కాదు. అత్తయ్య కోరుకున్న వాడితోనే తన పెళ్లి జరగాలి. 
జనార్థన్:  అంతా మీ ఇష్టమేనా ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నది దేనికి. 
రేవతి: అన్నయ్య మీ ప్రేమ నాకు ఎప్పుడూ కావాలి అలాగే కిరణ్‌ నాకు భర్తగా రావాలి అనుకుంటున్నా. నాకు కిరణ్ కట్టే తాళి చాలు ఈ గిఫ్ట్‌లు వద్దు. ఈ గిఫ్ట్‌లు మీరే తీసుకోండి.
సీత: రాఖీ పండగ రోజు చెల్లి కంట్లో నీరు తెప్పించారు మీరేం అన్నయ్యలు.
జనార్థన్:  సీత
రామ్: అవును నాన్న
సీత: మామయ్యలు ఎంత మంచివాళ్లు ఇలాంటి వాళ్లకి అలాంటి ఐడియాలు ఇచ్చిన వాళ్ల నోరు పడిపోవాలి. కాళ్లు పడిపోవాలి. కరోనా రావాలి. ఎవరు ఏం అన్నా కిరణ్‌ గారితోనే రేవతి పిన్ని పెళ్లి జరుగుతుంది అంతే.


సుమతికి రాఖీ కట్టడానికి శివకృష్ణ వస్తాడు. మహాలక్ష్మి వాళ్లు శివకృష్ణ కోసం ఎదురు చూస్తుంటారు. శివకృష్ణ రాగేనే ఎందుకు వచ్చారని అడుగుతారు. దాంతో శివకృష్ణ విద్యాదేవి కోసం వచ్చానని చెప్తాడు. రేవతి విద్యాదేవిని పిలుస్తుంది. విద్యాదేవి కిందకి వస్తుంది. వాళ్ల మాటలకు రేవతి, మహాలక్ష్మీ లు ఇద్దరూ మంచి నటులని అనుకుంటారు. ఇక విద్యాదేవి రాఖీ తీసుకురావడానికి వెళ్తుంది. అందరి ఎదురుగా విద్యాదేవి శివకృష్ణకు రాఖీ కడుతుంటే మహాలక్ష్మి ఆపుతుంది.


మహాలక్ష్మీ: మీ ఇద్దర్ని చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది. మీరు రాఖీ కట్టకముందే నా అనుమానం తీర్చాలి. మీరు నిజమైన అన్నాచెల్లెళ్లని అనిపిస్తుంది. రక్త సంబంధం తప్ప ఇంకే సంబంధం అయినా అది స్వచ్ఛమైనది కాదు అని నా అనుమానం.
సీత: నాన్న ఎందుకు వచ్చారు. మహాలక్ష్మీ అత్తయ్య దేని గురించి మాట్లాడుతున్నారు.
మహాలక్ష్మి: ఎక్కడో ఉన్న శివకృష్ణ గారు పల్లెటూరి నుంచి వచ్చి మీతో రాఖీ కట్టించుకుంటున్నారు అంటే ఏదో అనుమానంగా ఉంది. మీ మధ్య ఏదో రహస్యం ఉంది అని అనిపిస్తుంది. ఈ విద్యాదేవి మీ సొంత చెల్లిలా అనిపిస్తుంది. రూపం మారిన సుమతిలా అనిపిస్తుంది. 
అర్చన: అవును ఈవిడ మాట ప్రవర్తన అంతా సుమతి అక్కలా ఉంది. 
జనార్థన్: తాను సుమతి కాదేమో మహా
మహాలక్ష్మి: తను సుమతే అని నాకు బలంగా అనిపిస్తోంది జనా. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 
 
 Alos Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: జున్ను మిస్సింగ్.. ఒకరిని ఒకరు హగ్ చేసుకొని పడుకున్న తండ్రీకొడుకులు!