మీకు ఎప్పుడైనా టైంపాస్ కాకపోతే గూగుల్ మ్యాప్‌లు చూడండి. బోలేడన్ని చిత్రవిచిత్రాలు కనిపిస్తాయి. ఇప్పటికే చాలామంది.. గూగుల్ మ్యాప్‌లో ఎన్నో వింతలను కనిపెట్టారు. చివరికి గూగుల్ స్ట్రీట్స్‌ను కూడా వదల్లేదు. మ్యాప్‌లో కనిపించే శాటిలైట్ వ్యూస్ నుంచి స్ట్రీట్ వ్యూ వరకు ఏదీ వదలకుండా నెటిజనులు కొత్త కొత్త కనుగొంటున్నారు. తాజాగా ఓ భారీ రాకాసి పాము అస్థిపంజరాన్ని కనుగొన్నారు. ఒకప్పుడు డైనోసార్లు కాలంలో జీవించిన ‘టైటానోబోవా’ (titanoboa) అనే అతి పెద్ద పాము అస్థిపంజరం కావచ్చని అనుకున్నారు. గూగుల్ మ్యాప్‌ను జూమ్ చేస్తూ.. తీసిన ఈ వీడియోను ఇటీవల ‘టిక్‌ టాక్’లో పోస్టు చేశారు. దీంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. 


టైనానోబోవా పాము ముందు భారీ అనకొండాలు సైతం చిన్న చిన్న పాము పిల్లల్లా కనిపిస్తాయి. అంత పెద్ద పాము అస్థిపంజరం అక్కడ కనిపించిందంటే.. తప్పకుండా ఆ పాము ఇంకా బతికే ఉంటుందని నెటిజనులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘టిక్ టాక్’లో పోస్ట్ చేసిన ఆ పాము అస్థిపంజరం ఎక్కడుందో తెలుసుకోడానికి ‘ఫ్యాక్ట్ చెక్’ చేయగా.. ఆశ్చర్యం కలిగించే విషయం తెలిసింది. అది అసలు పామే కాదట. ఔనండి, నిజంగా మీకు ఆ గూగుల్ మ్యాప్‌లో పాము తరహాలో కనిపిస్తున్నా.. అది పామే కాదని తేలింది. మరి, పాము కాకపోతే అదేం జీవి అని అనుకుంటున్నారా? అది ఎలాంటి జీవి కాదు. లోహంతో తయారు చేసిన భారీ శిల్పం అది. 


Also Read: ‘డేటింగ్’ ఈమెకు జుజుబీ, ఆరుగురితో ఒకరికి తెలియకుండా మరొకరితో రొమాన్స్, చివరికి..


ఈ లోహపు శిల్పం ఫ్రాన్స్‌‌కు పశ్చిమంలో లే సర్పెంట్ డి'ఓషన్(Le Serpent d'Ocean) తీరంలో ఉంది. దీని పొడవు 425 అడుగులు (130 మీటర్లు). 2012లో చైనాకు చెందిన హువాంగ్ యంగ్ పింగ్ అనే కళాకారుడు దీన్ని రూపొందించాడు. కెరటాలు తీరాన్ని తాకే సమయంలో ఈ అస్థిపంజరాన్ని చూస్తే.. నిజంగానే పాము అక్కడ ఉందనే భావన కలుగుతుందట. ప్రపంచంలోనే అత్యంత భారీ పాముగా పేరొందిన టైటానోబోవా పాములు 42 అడుగులు (12.8 మీటర్లు) పొడవు, 1.25 టన్నుల బరువు ఉండేవట. దాదాపు 60 మిలియన్ యేళ్ల కిందట ఈ పాములు ఉనికిలో ఉండేవట. ఇవి అనకొండా జాతికి చెందిన పాములు. ప్రస్తుతం ఈ పాములు అంతరించిపోయాయి. 



వీడియో: 


Also Read: ఆమె జుట్టునే గూడుగా మార్చుకున్న పక్షి, 84 రోజులు అక్కడే తిష్ట!


Image Credit: Google Map