Viral Video: హరియాణా ఫరీదాబాద్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ త‌ల్లి త‌న కుమారుడ్ని 10 అంత‌స్తుల బాల్క‌నీ నుంచి వేలాడ‌దీసింది. ఇది చూసిన వారికి గుండె ఝల్లుమంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. నిజానికి ఇలా ఆ తల్లి ఎందుకు చేసిందో మీరే చూడండి.   






ఏం జరిగింది?


ఫరీదాబాద్‌ హైరైజ్‌లో ఉన్న అపార్ట్‌మెంట్‌లో చీరతో కట్టేసి ఉన్న ఓ బాలుడు, 10వ అంత‌స్తు బాల్కనీకి వెలుప‌ల వేలాడుతూ క‌నిపించాడు. బాలుడిని అత‌ని కుటుంబ స‌భ్యులు పైకి లాగుతూ ఉన్నారు. కేవ‌లం ఒక్క చీర కోసం త‌న కుమారుని ప్రాణాలు ప‌ణంగా పెట్టింది ఆ తల్లి.


ఆ కుటుంబం పదో అంత‌స్తులో నివాసం ఉంటోంది. పొర‌పాటున ఒక చీర తొమ్మిద‌వ అంత‌స్తు బాల్కనీలో ప‌డిపోయింది.  దానిని తీసుకురావ‌డానికి బాలుడికి బెడ్ షీట్ క‌ట్టి ప‌ద‌వ అంత‌స్తు నుంచి 9 వ అంత‌స్తు బాల్కనీలోకి దించారు ఆ కుటుంబ సభ్యులు. చీర తీసుకుని ఉన్న బాలుడిని అత‌ని త‌ల్లి, కుటుంబ స‌భ్యులు పైకి లాగుతున్న దృశ్యాలు ఆ వీడియోలో క‌నిపించాయి. 


వీడియో వైరల్


ఈ షాకింగ్ ఘ‌ట‌న‌ గత వారం ఫరీదాబాద్‌లోని సెక్టార్ 82లోని ఓ సొసైటీలో జరిగింది. ఎదురుగా ఉన్న భవనంలో ఉంటున్న వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరించాడు. తాళం వేసి ఉన్న ఇంటి బాల్కనీలో పడిన చీరను తీసుకోవడానికి తన కొడుకు ప్రాణాలనే పణంగా పెట్టింది ఆ తల్లి. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది.


ఇలా చీర కోసం కుమారుడి ప్రాణాలతో తల్లి చెలగాటమాడటంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ తల్లి, కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ ఘటనపై సొసైటీ ఆమెకు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. 


Also Read: BSF Seized Pak Boats: గుజరాత్‌ తీర ప్రాంతంలోకి చొరబడిన పాక్ పడవలు.. స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్


Also Read:SC on Hijab Row: 'హిజాబ్‌'పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్- విచారణకు సుప్రీం నో