Indian Airforce Apprentice Form 2022: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. అర్హులు ఫిబ్రవరి 19లోపు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది.
అప్రెంటీస్ ట్రైనింగ్( టెక్నికల్ ట్రైనింగ్) కోర్సు కోసం ఈ ఏడాది మార్చి 17న పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్షకు హాజరై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలనుకునే వాళ్లు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
80 పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
మెషినిస్ట్- 4 ఉద్యోగులు
షీట్ మెటల్- 7 ఉద్యోగులు
వెల్డర్ గ్యాస్ & ఎలెక్ట్- 6పోస్టులు
మెకానిక్ రేడియయో రాడార్ ఎయిర్‌క్రాఫ్ట్- 9 పోస్టులు
కార్పెంటర్-3 ఉద్యోగాలు
ఎలక్ట్రీషియన్ ఎయిర్‌క్రాఫ్ట్- 24 ఉద్యోగాలు
పెయింటర్ జనరల్- 1 పోస్ట్
ఫిట్టర్ - 26 ఉద్యోగాలు
ఈ ట్రైనింగ్ టైంలో ప్రతి అభ్యర్థికి 7,700 రూపాయలు స్టైపెండ్ ఇస్తారు.
విద్యార్హతలు
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అప్రెంటీస్ ఆన్‌లైన్ ఫార్మ్-2022 కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఇంటర్‌మీడియట్ యాభై శాతం మార్కులతో పాసై ఉండాలి. 65శాతం మార్కులతో ఐటీఐ కూడా పూర్తి చేసిన వాళ్లే అర్హులు.
దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఈ డాక్యుంమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది
పదో తరగతి సర్టిఫికేట్
ఇంటర్ మార్క్‌షీట్, పాస్ సర్టిఫికేట్
డిప్లమో డిగ్రీ, మార్క్‌షీట్
పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫొటోగ్రాఫ్
సంతకం
ఎడమచేతి బొటనవేలి ముద్ర
అభ్యర్థి తల్లిదండ్రుల ఫొటో
పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ కూడా ఉంటుంది.
ఏజ్ లిమిట్
ఏప్రిల్1 నాటికి 14ఏళ్లు దాటి.. 21 ఏళ్ల లోపు ఉన్న వాళ్లే అర్హులు.
ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్ తీసుకోవడం స్టార్ట్ అయిన తేదీ:- జనవరి 28
ఆఖరి తేదీ: ఫిబ్రవరి 19
పరీక్ష: మార్చి 1
మెరిట్ లిస్ట్ విడుదల తేదీ: మార్చి 17
Also Read: ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్.. సిబ్బంది కొరత మాటే రాకూడదంటూ హెచ్చరిక
Also Read: ఈ పది కోర్సుల్లో ఏది ఎంచుకున్నా మీ భవిష్యత్‌కు తిరుగు ఉండదేమో చూడండి