North Carolina Death Certificate:
ట్విటర్‌లో ఆనంద్ మహీంద్రా చేసే పోస్ట్‌లకు ఉండే క్రేజే వేరు. ఆయన ఏ ట్వీట్ చేసినా చాలా ఆసక్తిగా గమనిస్తుంటారు నెటిజన్లు. అంత ఫన్నీగా ఉంటాయవి. రీసెంట్‌గా షేర్ చేసిన పోస్ట్ కూడా కడుపుబ్బా నవ్విస్తోంది. డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసే పోర్టల్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. అందులో "Myself" అనే ఆప్షన్ కనిపించటం ఆయనను షాక్‌కు గురి చేసింది. వెంటనే అది స్క్రీన్‌షాట్ తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అయితే అది వేరే దేశానికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ పోర్టల్. నార్త్ కరోలినాకు సంబంధించిన ఈ పోర్టల్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసిన ఆయన "మరణించిన తరవాత కూడా ఇక్కడే ఉంటామని (ఆత్మ ఇక్కడే తిరుగుతుందని) నమ్మే వారిలో మనం మాత్రమే లేము. (ఈ డెత్ పోర్టల్‌ను తయారు చేసిన దేశం కూడా నమ్ముతోందనే అర్థంలో)" అని పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. రకరకాల కామెంట్లతో స్పందిస్తున్నారు.