అలెక్స్ ఎల్లిస్.. బ్రిటిష్ హైకమిషనర్. అయితే ఈ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ఇందుకు కారణమేంటని అనుకుంటున్నారా? అలెక్స్ ట్విట్టర్ లో పెట్టిన ఓ వీడియోకు భారతీయులు ఫిదా అయిపోయారు. ఇంతకీ ఆ వీడియో ఏంటో తెలుసా? మసాలా దోశ ఎలా తినాలి అనే దానిపై. అవును మీరు విన్నది నిజమే. ఆ కథేంటో చదివేయండి.


ఎందుకింత వైరల్ అయింది..


అలెక్స్ రెండు రోజుల కర్ణాటక పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఓ సూపర్ స్పెషల్ దోశ తిని.. ఆ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి కన్నడలో 'బొమాబాత్ గురూ' అని క్యాప్షన్ రాశారు. అంటే సూపర్ అని అర్థం. అంతేకాదు ట్విట్టర్ లో తాను తిన్న దోశపై ఓ పోల్ కూడా నిర్వహించారు. నేను బాగానే తిన్నానా అంటూ ట్విట్టర్ లో పెట్టిన పోల్ లో దాదాపు 92 శాతం మంది అలెక్స్ ను.. స్పూన్, ఫోర్క్ తో కాకుండా చేతితో తినాలని సూచించారు.






ఈ పోల్ ను గమనించిన అలెక్స్.. తర్వాత వారు చెప్పినదానికి అంగీకరించి మసాలా దోశను చేతితో తిని ఆ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు తమ మాట ఆయన చూపిన గౌరవానికి ఫిదా అయ్యారు. ఈ వీడియోను విపరీతంగా వైరల్ చేస్తున్నారు. 






ఈ వీడియోలను పోస్ట్ చేయడమే కాకుండా తన పర్యటనకు ఎంతగానో సహకరించిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకు కన్నడలో ధన్యవాదాలు చెప్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకు, సీఎ ఆఫీస్ కు ట్యాగ్ చేశారు.