Mermaid in Japan | ‘సాహస వీరుడు - సాగర కన్య’ సినిమాలో శిల్పశెట్టిని చూసి.. ‘మత్స్య కన్య’ అంటే ఇలాగే ఉంటుంది కాబోలు అని చాలామంది భావించి ఉంటారు. అయితే, అది సినిమాలోనే సాధ్యం, నిజంగా అలాంటివి ఉండవని కూడా చాలామంది కొట్టేడేసి ఉంటారు. అయితే, జపాన్, కొరియా ప్రజలు మత్స్య కన్యలు నిజంగానే ఉన్నాయని నమ్ముతారు. అవి వాటిని తమ సాంప్రదాయంలో భాగంగా పేర్కొంటారు. ‘మత్స్యకన్య’ నేపథ్యంలో సినిమాలు కూడా ఉన్నాయి. అయితే, అసలైన ‘మత్స్యకన్య’ను చూస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అది మనిషింత కాకుండా చేప సైజులోనే ఉంటుంది. 


300 ఏళ్ల కిందట చిక్కిందట: ఇటీవల జపాన్‌లోని ఒకాయమా ప్రిఫెక్చర్ దేవాలయంలోని ఓ పెట్టెలో లభించిన ‘మమ్మీ’ని చూసి ఆశ్చర్యపోయారు. నడుము వరకు మనిషిలా, మిగతా భాగం చేప తరహాలో ఉండటంతో షాకయ్యారు. అప్పటి వరకు ‘మత్స్యకన్య’ అనేది అపోహ మాత్రమే అని అనుకున్న పరిశోధకులు ఆ ఆలయంలో దొరికిన ‘మత్స్యకన్య’ను స్కాన్ చేయడం మొదలుపెట్టారు. 300 ఏళ్ల కిందట ఓ మత్స్యకారుడికి దొరికిన ఈ ‘మత్స్యకన్య’ను ఎవరు ఆలయంలో పెట్టారనేది ఇప్పటికీ మిస్టరీయే. ‘మత్స్యకన్య’లో ఎన్నో ఔషద గుణాలు ఉంటాయని, దాన్ని పూజిస్తే ఆరోగ్యంగా జీవిస్తారనే విశ్వాసంతో గత కొన్ని శతాబ్దాలుగా దానికి పూజలు అర్పిస్తున్నారు.  


మూలాలు తెలుసుకోడానికి DNA టెస్ట్: ఆ పెట్టలో ఉన్న నోట్ ప్రకారం 1736-1741 మధ్య కాలంలో ఒక మత్స్యకారుడు దాన్ని పట్టుకున్నాడని, దాన్ని అతడు ఓ సంపన్న కుటుంబానికి విక్రయించినట్లు ఉంది. ఒకాయమా ఫోక్‌లోర్ సొసైటీ బోర్డు సభ్యుడు హిరోషి కినోషితా ఈ మత్య కన్య మూలలను తెలుసుకోడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దాన్ని పరిశీలించడం కోసం ఇప్పటికే ఆలయ నిర్వాహకుల అనుమతి తీసుకున్నారు. ఇప్పటికే ఆ మమ్మీకి CT స్కాన్‌ నిర్వహించారు. దాని DNA నమూనాలను సైతం పరిశీలిస్తున్నారు. దాని ఫలితాలు ఈ ఏడాదిలో ప్రకటించే అవకాశాలున్నాయి. అయితే, అది కోతి-చేప సంక్రమణ వల్ల పుట్టిన కొత్త జాతి కావచ్చని భావిస్తున్నారు. 


Also Read: చంకల్లో పౌడర్ పూయడం మంచిదేనా? అక్కడ నల్లగా ఎందుకు మారుతుంది?


800 ఏళ్లు జీవించిన మహిళ: ఈ ‘మత్స్యకన్య’ పోలికలు.. రెండు జపనీస్ జానపద కథల్లో పేర్కొన్న జీవులకు దగ్గరగా ఉండటం గమనార్హం. మనిషి తలలతో ఉన్న చేపలను పురాణాల్లో వాటిని ‘నింగ్యోస్’గా పేర్కొన్నారు. ఈ జీవులు జీవులు అద్భుతమైన అనారోగ్య నివారణలని, వీటిని తీసుకుంటే ఆయుష్సు పెరుగుతుందని కూడా కథల్లో పేర్కొన్నారు. ఓ కథలో యావో బికుని అనే మహిళ అనుకోకుండా మొత్తం ‘నింగ్యోస్’ను తిన్న తర్వాత 800 సంవత్సరాలు జీవించినట్లు ఉంది. దీంతో ‘మత్స్యకన్య’ చాలా శక్తివంతమైనదని, పాజిటివ్ ఎనర్జీ అందిస్తుందనే కారణంతో దాన్ని ఆలయంలో ఉంచి పూజలర్పిస్తున్నట్లు ప్రదాన పూజారి కోజెన్ కుయిడా ఓ మీడియా సంస్థకు తెలిపాడు. జపాన్‌లోని మరో రెండు దేవాలయాల్లో కూడా మత్స్యకన్యలను పూజించేవారని తెలిసింది. అయితే, అవి నకిలీ మత్స్యకన్యలు కావచ్చని, సందర్శకులను ఆకట్టుకోవడం కోసమే వాటిని తయారు చేసి ఉండవచ్చని పరిశోధకులు తెలుపుతున్నారు.  



Also Read: ఓ మై గాడ్, ఇతడి నాలుకపై జుట్టు పెరుగుతోంది, కారణం తెలిస్తే ఇక నిద్రపట్టదు!