Prabhas Maruthi Movie Update: ప్రభాస్‌తో మారుతి మసాలా ఎంట‌ర్‌టైన‌ర్, మరిన్ని డీటెయిల్స్ ఇవిగో!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. మరిన్ని డీటెయిల్స్ కోసం...

Continues below advertisement

మారుతి అంటే వినోదం, వినోదం అంటే మారుతి. మాస్, క్లాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసే వినోదం అందించడంలో దర్శకుడు మారుతి సిద్ధహస్తుడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ఆయనకు సినిమా చేసే అవకాశం లభించిన సంగతి తెలిసిందే. మారుతి చెప్పిన కథ, అందులో వినోదం నచ్చడంతో సినిమా చేయడానికి ప్రభాస్ పచ్చ జెండా ఊపేశారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలిసింది.

Continues below advertisement

త్వరలో ప్రభాస్ - మారుతి కలయికలో సినిమాను అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించారు. ఆల్రెడీ ఈ సినిమా ఫిక్స్ అనేది తెలిసిందే. మాంచి ముహూర్తం చూసి సినిమాను ప్రకటించనున్నారు. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే... మసాలా ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమా రూపొందుతోంది. 'బాహుబలి'లో రాజ్యాలు, యుద్ధాలు ఎక్కువ. 'సాహో'లో యాక్షన్ ఎక్కువ. 'రాధే శ్యామ్' ప్రేమకథ. సో... మారుతి దర్శకత్వంలో మసాలా ఎంట‌ర్‌టైన‌ర్‌ త్వరగా స్టార్ట్ చేయాలని ప్రభాస్ ఆసక్తిగా ఉన్నారని తెలిసింది. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ మారుతి స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేశారని తెలిసింది. త్వరలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Also Read: కమల్ హాసన్ 'విక్రమ్' విడుదల తేదీ ఖరారు, ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందంటే?

ప్రభాస్ - మారుతి సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. మాళవికా మోహనన్, శ్రీలీల, మెహరీన్ కౌర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అలాగే, సినిమాకు 'రాజు డీలక్స్' టైటిల్ ఖరారు చేశారట. అయితే... ఈ వివరాల్ని అధికారికంగా ప్రకటించలేదు. ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ... వసూళ్ల పరంగా రికార్డులు నెలకొల్పుతోంది. 

Also Read: 'మారన్' రివ్యూ: కార్తీక్, ధనుష్ కలిసి ఇలా చేశారేంటి?

Continues below advertisement