రైతులు పండించిన పంటలను ప్రభుత్వం కొనకుండా.. యాసంగిలో వరి వేయెద్దని చెప్పిందని, మరోవైపు రుణాలు మాఫీ చేయడం లేదని.. ఈ కారణంగా అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ముఖ్యమంత్రి.. ఊసరవెళ్లిలా మాటలు మారుస్తున్నారన్నారు. పూటకో మాట మార్చి.. రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారని ఆరోపించారు.
మెదక్ జిల్లా నుంచి వైఎస్ షర్మిల 'రైతు ఆవేదన యాత్ర' ప్రారంభమైంది. నర్సాపుర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలంలోని కంచన్ పల్లి, లింగంపల్లి గ్రామాల మీదుగా ఈ యాత్ర జరిగింది. ఆత్మహత్య ముగ్గురు రైతుల కుటుంబాలను షర్మిల కలిసి పరామర్శించారు.
కంచన్ పల్లి గ్రామానికి చెందిన రైతు గుండ్ల శ్రీకాంత్ అప్పులు పెరగడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ గ్రామానికే చెందిన మరో రైతు మహేష్ తనకున్న రెండు ఎకరాల్లో భూమి వేసి అప్పుల పాలయ్యాడు. ఇక అప్పులు తీర్చే దారిలేక ఆత్మహత్య చేసుకున్నాడు. లింగంపల్లి గ్రామానికి చెందిన షేకులు అనే రైతుకు రెండెకరాల భూమి ఉంది. ఫైనాన్స్ లో ట్రాక్టర్ కొనుగోలు చేసి.. మరోవైపు పంట సరిగరాకపోవడంతో.. అప్పులు పెరిగి ఆత్మహత్య చేసుకున్నాడు.
పంట కొనేవారు లేక.. మరోవైపు.. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని... షర్మిల అన్నారు. 'రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పాపం కేసీఆర్‌దే. టీఆర్ఎస్ ప్రభుత్వమే దీనికి కారణం. ముఖ్యమంత్రి.. ఊసరవెళ్లిలా మాటలు మారుస్తున్నారు. రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. వరి వేయొద్దని చెప్పే ముఖ్యమంత్రి కోటి ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పి, కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టినట్టు?' అని షర్మిల ప్రశ్నించారు.
లక్షకోట్ల అప్పు ఎందుకు తెచ్చారని ప్రభుత్వాన్ని షర్మిల ప్రశ్నించారు. ఇప్పుడు ఆ భారం ప్రజలపై పడిందన్నారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టులు కడుతున్నారా అని ప్రశ్నించారు. ఎంత మంది రైతులను ఆత్మహత్య బాట పట్టిస్తారు అని షర్మిల అడిగారు. ఏ హక్కు ఉందని వరి వేసుకోవద్దని చెబుతున్నారన్నారు. వరి వేసిన రైతుల పంటను కొనుగోలు చేసే బాధ్యత.. ప్రభుత్వంపై ఉందని షర్మిల అన్నారు. 70 రోజుల్లోనే 200 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని షర్మిల చెప్పారు. ఆ రైతుల కుటుంబాలకు రూ.25లక్షలు అందజేయాలని డిమాండ్ చేశారు. యాసంగిలో వరి కొనాలన్నారు.
Also Read: IMD Alert: సాయంత్రమైతే చలి చంపేస్తోంది.. ఇంకా పెరిగే అవకాశం.. ఈ జిల్లాల్లో గజ గజే
Also Read: Kishan Reddy: నేను నాగలి కడతా.. నువ్వు కడతావా కేసీఆర్, ఆ పౌరుషం చూపాల్సిందే.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
Also Read: Gay Marriage in Telangana: తెలంగాణలో తొలి ‘గే’ వివాహం.. మంగళ స్నానాలు, సంగీత్ అన్నీ..