Youngster Halchal In Kondapur AMB Mall: కొందరు రాత్రికి రాత్రే ఫేమస్ కావాలని సోషల్ మీడియాలో చిత్ర విచిత్రమైన చేష్టలు చేస్తుంటారు. నడిరోడ్డుపైనే ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తుంటారు. లైక్స్, షేర్స్, వ్యూస్ కోసం కొందరు ఎంతకైనా తెగిస్తుంటారు. ఇటీవలే ఓ యువకుడు రహదారి పక్కన డబ్బులు విసిరేసి వాటిని తీసుకోవాంటూ నెట్టింట వీడియో షేర్ చేశాడు. దీనిపై స్పందించిన పోలీసులు సదరు యువకుడిపై కేసు నమోదు చేశారు.
తాజాగా, హైదరాబాద్ కొండాపూర్‌లోని (Kondapur) ఏఎంబీ మాల్‌లో అదే యువకుడు.. డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాగ్రామ్‌లో ప్రచారం చేశాడు. తన ఫాలోవర్స్ అంతా ఏఎంబీ మాల్ రెండో అంతస్తులోకి వస్తే వారికి డబ్బులు ఇస్తానని ప్రచారం చేశాడు. అంతేకాకుండా కారులోంచి దిగి చుట్టూ బౌన్సర్లతో సూట్‌కేస్‌లతో మాల్‌లోకి వచ్చి హల్చల్ చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. కాగా, ఈ యువకుడు గతంలో కేపీహెచ్‌బీ రోడ్లపై డబ్బులు చల్లి హల్చల్ చేశాడు. దీంతో అతనిపై కేసు నమోదైంది. తాజా ఘటనపై ఎలాంటి సమాచారం లేదని.. ఎటువంటి కేసు నమోదు కాలేదని గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.