How to Use Satellite Messaging: ఐఫోన్, గూగుల్ పిక్సెల్ 9 స్మార్ట్ ఫోన్లు ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణాలను రక్షించగల ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. అదే శాటిలైట్ మెసేజింగ్. ఇది మొబైల్ నెట్‌వర్క్, వైఫై లేనప్పుడు కూడా మెసేజ్‌లను పంపడానికి అనుమతిస్తుంది. శాటిలైట్ మెసేజింగ్ ద్వారా ఎమర్జింగ్ సర్వీస్‌ను సంప్రదించవచ్చు. ఈ సర్వీసు ఇప్పటికే గూగుల్ పిక్సెల్ 9లో ముందే ఇన్‌స్టాల్ అయింది. అయితే ఈ ఫీచర్ ఐవోఎస్ 18 అప్‌డేట్‌లో ఐఫోన్ 14, 15, 16లో కూడా వచ్చింది. ఈ సర్వీసును ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ఐఫోన్‌లో శాటిలైట్ మెసేజింగ్‌ను ఎలా ఉపయోగించాలి?
శాటిలైట్ మెసేజింగ్‌ను ఉపయోగించడానికి మీరు ముందుగా ఆకాశం స్పష్టంగా కనిపించే చోటుకు రావాలి. బలమైన తుఫాను వంటి పరిస్థితిలో ఈ ఫీచర్ పనిచేయదు. ముందుగా స్వచ్చమైన ఆకాశం కిందకు వచ్చి ఎమర్జెన్సీ నంబర్లను సంప్రదించండి. ఈ కాల్ ఐఫోన్‌లో కనెక్ట్ కాకపోతే "Emergency Text via Satellite" అనే అలెర్ట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్‌పై కొన్ని సూచనలు కనిపిస్తాయి. దీని తరువాత శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ రెస్పాండర్‌తో కాంటాక్ట్ ఏర్పడుతుంది. వారు మెసేజ్‌ల ద్వారా కమ్యూనికేట్ చేయవచ్చు. 



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!


గూగుల్ పిక్సెల్ 9 స్మార్ట్ ఫోన్‌లో ఎలా ఉపయోగించాలి?
వైఫై, మొబైల్ నెట్‌వర్క్ లేనప్పుడు గూగుల్ పిక్సెల్ 9లో శాటిలైట్ ద్వారా మెసేజ్‌లను పంపవచ్చు. దీని పద్ధతి కూడా సరిగ్గా ఐఫోన్ లాగానే ఉంటుంది. ఇందుకోసం ముందుగా ఎమర్జెన్సీ నంబర్‌కు డయల్ చేయండి. ఈ కాల్ కనెక్ట్ కాకపోతే స్క్రీన్‌పై శాటిలైట్ ఎస్ఓఎస్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. తర్వాత స్టార్ట్ బటన్‌ను నొక్కండి.


దీని తర్వాత ఐఫోన్ లాగా కొన్ని సూచనలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిని అనుసరించండి. ప్రతిదీ సరిగ్గా జరిగితే మీరు శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ రెస్పాండర్‌తో కనెక్ట్ అవుతారు. అయితే మీ కాంటాక్్ కాల్ ద్వారా కాకుండా మెసేజ్ ద్వారా ఉంటుందని గుర్తుంచుకోండి.



Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?