Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ త్రిలోక్‌ని కలిసి విద్యాదేవిని జైలుకి పంపడానికి తాను ఓ ప్లాన్ వేశానని రోడ్డు మ్యాప్ చూపించి తన ప్లాన్ చెప్తుంది. బిజినెస్ టూర్ అని చెప్పి ఇంట్లో నుంచి బయల్దేరి కొండ ప్రాంతంలో కారు లోయలో తోసేసి కారు బ్లాస్ట్‌ అయిన తర్వాత ఇదంతా విద్యాదేవి చేసిందని ఆమెను అరెస్ట్ చేయండి అని చెప్తుంది. ఇక పోలీస్ సాక్ష్యం ఏంటి అంటే అర్చనతో మహాలక్ష్మీ తీయించిన వీడియో చూపిస్తుంది. 


సుమతికి ఉరి శిక్ష వేయింస్తానని రేపు స్టార్ట్ అవ్వగానే చెప్పమని త్రిలోక్ మహాలక్ష్మీతో చెప్పి వెళ్లిపోతాడు. రాత్రి మహాలక్ష్మీ ఇంట్లో అందరితో ముఖ్యమైన బిజినెస్ పని మీద రేపు బెంగుళూరు వెళ్తున్నా అని మహాలక్ష్మీ చెప్తుంది. 


సీత: ముఖ్యమైన మీటింగ్ అంటున్నారు కదా మరి మీరు ఒక్కరే వెళ్లడం ఎందుకు మామనో మామయ్యనో తీసుకెళ్లొచ్చు కదా.
మహాలక్ష్మీ: నీ సలహాలు అవసరం లేదు.
విద్యాదేవి: అంత దూరం ఒక్కరే వెళ్లడం రిస్క్ అని సీత ఉద్దేశం. 
అర్చన: సీతకి మీరు తోడు ఉన్నట్లు మహాకి మరొకరి తోడు అవసరం లేదు టీచర్ గారు.
మహాలక్ష్మీ: జనా, గిరి, రామ్‌లకు ఇక్కడ ఆఫీస్‌పనులు ఉన్నాయి అందరం వెళ్తే ఇక్కడ ఆఫీస్ పనులు ఆగిపోతాయ్.
సీత: అయినా ఇంత సడెన్‌గా బిజినెస్ పనులేంటి.
గిరిధర్: బిజినెస్ పనులు అంటేనే ఇలా ఉంటాయ్ ఏదో ఒకటి రెండు రోజులు ఆఫీస్‌కి వెళ్లగానే అన్నీ నీకు తెలుసు అనుకోవద్దు సీత.


కారులో వెళ్తా అని మహాలక్ష్మీ చెప్తే కారులో ఎందుకు అని సీత అంటుంది. విద్యాదేవి కూడా విమానంలో వెళ్లకుండా కారులో ఎందుకు అంటుంది. దాంతో మహాలక్ష్మీ అనంతపురం, హిందూపురంలో పనులు ఉన్నాయని అంటుంది. సీత మాత్రం ఏదో జరుగుతుందని అనుమానిస్తుంది. ఉదయం మహాలక్ష్మీ బయల్దేరుతుంది. అందరూ క్షేమంగా వెళ్లి రమ్మని చెప్తారు. అందరికీ చెప్పిన మహాలక్ష్మీ విద్యాదేవిని కూడా పిలిచి నవ్వుతూ బయల్దేరుతున్నానని అంటుంది. ఇక ఆమెతో నైట్ అంతా ఆలోచించాను మీరు వచ్చినప్పటి నుంచి మీతో గొడవ పడుతూనే ఉన్నాను అది తప్పు అనిపించింది అని చెప్పి మీ మీద కోపంలేదు అని అంటుంది. ఈ వయసులో గొడవ పడటం మనద్దిరికీ మంచిది కాదని మీరు మా ఇంటి మనిషి అని ఎప్పటికీ మాతో కలిసి ఉంటారని అంటుంది. అర్చన మనసులో సుమతితో మహాలక్ష్మీ ఏంటి ఇలా మాట్లాడుతుందని అనుకుంటుంది.


ఇక మహాలక్ష్మీ మనసులో ఇలా మాట్లాడితే రేపు నిన్ను అందరూ తప్పుగా అనుకుంటారని అనుకుంటుంది. ఇక మహాలక్ష్మీ ఇళ్లు జాగ్రత్త అని విద్యాదేవికి చెప్పి వెళ్తుంది. అందరూ మహాలక్ష్మీని దగ్గరుండి పంపిస్తారు. మహాలక్ష్మీ బయల్దేరగానే పోలీస్ త్రిలోక్‌కి కాల్ చేసి చెప్తుంది. కారులో నుంచి లోయలో పడకుండా జాగ్రత్తలు తీసుకోమని అంటాడు. ఇక కంపెనీ విషయంలో మాట్లాడటానికి మహాలక్ష్మీకి రామ్ కాల్ చేస్తాడు. మహాలక్ష్మీ కావాలనే ఫోన్ స్విఛ్ ఆప్ చేస్తుంది. ఇంట్లో అందరూ టెన్షన్ పడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


 Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఇది అది కాదు.. అదే ఇది.. ఇంటి వారసురాలి ఇడ్లీ బండి కథ షురూ!