Sharmila :  తెలంగాణలో పార్టీ పెట్టి మూడు వేల కిలోమటీర్లకుపైగా పాదయాత్ర చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల రాజకీయంగా క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. పార్టీని ఓ మాదిరిగా నిర్మించుకోలేకపోయారు. కనీసం తాను పోటీ  చేయాలనుకున్న సీటులోనూ ప్రభావం చూపలేకపోయారు. అంతే కాదు.. చివరికి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ప్రయత్నించి విఫలమవుతున్నారు. కాంగ్రెస్ చర్చలు జరిపిన తన డిమాండ్లను కనీసం పట్టించుకోలేదు. ఏ సమాదానమూ చెప్పలేదు. దీంతో షర్మిల అత్యంత కీలక సమయంలో సైలెంట్ అయిపోయారు. కేవలం ట్వీట్లకే పరిమితమవుతున్నారు. 


విలీనానికి షరతులు ఎవరు పెట్టారు ? 


వైఎస్ కుటుంబంతో దగ్గర సంబంధాలు ఉన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సాయంతో షర్మిల కాంగ్రెస్ చెంతకు చేరాలనుకున్నారు. మొదట పొత్తుల కోసం ప్రయత్నించారో లేకపోతే విలీనం కోసం ప్రయత్నించారో స్పష్టత లేదు కానీ.. చివరికి.. విలీనమేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది. షర్మిల ఏ విషయం బహిరంగంగా చెప్పనప్పటికీ రాహుల్ గాంధీని అభినందిస్తూ ట్వీట్లు పెట్టారు. కాంగ్రెస్ పార్టీని పల్లెత్తు మాట అనడం లేదు. అయితే పార్టీ విలీనానికి కొన్ని షరతులు పెట్టారని వాటి విషయంలో క్లారిటీ లేకపోడంతో అటు షర్మిల, ఇటు కాంగ్రెస్ కూడా సైలెంట్ గా ఉన్నాయని చెబుతున్నారు. ఏపీలో రాజకీయాలు చేయాలని హైకమాండ్, తెలంగాణలోనే ఉంటానని షర్మిల పట్టుబడుతూండటంతో చర్చలు కొలిక్కి రాలేదంటున్నారు. 


గోరంట్ల మాధవ్‌కు ఈ సారి టిక్కెట్ లేనట్లేనా ? సైలెంట్ అయిపోయిన ఎంపీ !


తెలంగాణలో షర్మిలను అంగీకరించని నేతలు


తెలంగాణ కాంగ్రెస్ నేతలు షర్మిల పార్టీ విలీనానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఆమె తెలంగాణలో కనీస ప్రభావం చూపే అవకాశం లేదని నివేదికలను హైకమాండ్ ముందు పెడుతున్నారు. కానీ  పార్టీలో విలీనం అయితే.. షర్మిల కాంగ్రెస్ నేతగా గుర్తింపు పొందిన తర్వాత... అది మైనస్ అవుతుందని అంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకిగా సమాజం భావిస్తుందని... అది ఓటర్ల సెంటిమెంట్ పై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. అందుకే.. షర్మిలకు ఏపీలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా ఇవ్వకూడదని అంటున్నారు. మొన్నటిదాకా పాలేరు లేదా సికింద్రాబాద్ నుంచి  పోటీ చేయమని ఆఫర్ ఇచ్చారని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం.. స్పందన లేదు. 


తెలంగాణలో ఎన్నికల వలసలు - ఎవరెవరు ఏ పార్టీలోకి మారుతున్నారంటే ?


కీలక సమయంలో సైలెంట్ గా ఉన్న షర్మిల


వ్యయప్రయాసలకు ఓర్చి షర్మిల పాదయాత్ర చేశారు. మొదట్లో ఎవరూ పట్టించుకోకపోయినా తర్వాత వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా అటెన్షన్ సాధించారు. ఆమెపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాడి జరగడం.. తర్వాత హైదరాబాద్‌లో హైడ్రామాతో షర్మిల పార్టీకి కూడా హైప్ వచ్చింది. తర్వాత పాలేరులో పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ అక్కడ కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేయలేకపోయారు. ఇప్పుడు షర్మిల అసలు పోటీ చేస్తారా లేదా అన్న సందేహాలు వస్తున్నాయి. షర్మిల పార్టీలో నెంబర్ టు ఎవరూ లేరు. కనీసం ఓ మాదిరి ప్రజాబలం ఉన్న నేత కూడా ఎవరూ లేదు., ఎలా చూసినా షర్మిల తన పార్టీ ముద్రను  బలంగా వేయలేకపోయారు. వలీనం చర్చలతో.. రాజకీయంగా మరింత నష్టపోయారన్న వాదన వినిపిస్తోంది.