నిన్నటి ఆవర్తనం ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం పరిసరల్లోని, పశ్చిమమధ్య బంగాళాఖతంలో సగటు సముద్ర మట్టంకి 1.5 కిమీ నుండి 5.8 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపుకు వంగి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు తూర్పు పశ్చిమ ద్రోణి (షీర్ జోన్) సుమారుగా 15°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుండి 4.5 కిమీ నుండి 7.6 కిమీ ఎత్తు మధ్య  ఏర్పడిందని తెలిపారు. 


రాగల మూడు రోజులు  రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు  వర్షాలు  అనేక చోట్ల  కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు రేపు, ఎల్లుండి భారీ వర్షాలు రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.


హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.2 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 79 శాతంగా నమోదైంది.


ఏపీలోనూ వర్షాలు
ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అటు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30  నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే ఛాన్స్ ఉంది.


తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30  నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.


రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30  నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


‘‘ఏలూరు జిల్లాలోని వివిధ భాగాలతో పాటుగా తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు, భారీ వర్షాలు చూసే అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి సమయం నుంచి రేపు ఉదయంలోపల కృష్ణా, గుంటూరు, ఎన్.టీ.ఆర్. కొనసీమ​, కాకినాడ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని చోట్లల్లో భారీ వర్షాలు చూడగలము. ఉత్తరాంధ్ర కొండ ప్రాంతాల్లో వర్షాలు నేరుగా కోస్తాంధ్ర వైపుగా వస్తున్నాయి. అది దిగువ ప్రాంతాల్లోకి అడుగుపెట్టాకనే గోదావరి జిల్లాల్లో, మధ్య ఆంధ్ర జిల్లాల్లో వర్షాలను చూడగలము. అర్ధరాత్రి, రేపు తెల్లవారి గోదావరి జిల్లాల్లో వర్షాలకి చాలా అనుకూలంగా ఉంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.