Weather Latest News: తెలంగాణలో నేడు, రేపు రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనున్నట్లు తెలిపింది. ఈ వాయుగుండం బంగాళాఖాతంలో వాయువ్య దిశగా పయనించి 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని, దీంతో తెలంగాణవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చునని తెలిపింది. హైదరాబాద్‌లో ఉదయం నుంచి మేఘావృతమైన వాతావరణం ఉండవచ్చునని, పరిసర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురువవచ్చునని తెలిపింది.
అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాలకు తేలికపాటి వర్ష సూచన, దక్షిణ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
హైదరాబాద్‌లో వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి కనిపించనుంది. ఉదయం వేళల్లో హైదరాబాద్ నగరంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 21 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో ఆగ్నేయ దిశలో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.7 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 85 శాతంగా నమోదైంది.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం
దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఈరోజు తీవ్ర అల్పపీడనంగా దక్షిణ అండమాన్ సముద్రంలో ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ నవంబర్ 30 కల్లా ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ వాయుగుండం తర్వాత వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడుతూ నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో డిసెంబర్ 2వ తేదీ కల్లా తుపానుగా ఏర్పడనుంది.
ఈ ప్రభావం ఏపీపై కాస్త ఉండనుంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.