Weather Latest News: జూలై 7న హైదరాబాద్ వాతావరణ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆవర్తనం ఒకటి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కి. మీ. మధ్యలో కేంద్రీకృతమై ఉందని.. వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. తెలంగాణపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని అధికారులు తెలిపారు.


రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast): 


ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల, ఎల్లుండి చాలా చోట్ల కురిసే  అవకాశం ఉంది. రాష్ట్రంలో స్థిరమైన ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.


వాతావరణ హెచ్చరికలు (weather warnings)


ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే వర్షాలు అవకాశం వుంది.


నేడు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. 


Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 6 - 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.5 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.8 డిగ్రీలుగా నమోదైంది. 81 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.


ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: నిన్న తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్రమట్టానికి సగటున 5.8 కిలో మీటర్లు, 7.6 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


అమరావతి వాతావరణ విభాగం అధికారులు జూలై 6న విడుదల చేసిన ఓ ప్రకటనలోని వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. 


దక్షిణ కోస్తాలోనూ ఓ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపారు.